Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 27, 2022

Record teachers' attendance by cell phones


 సెల్ ఫోన్ల ద్వారా టీచర్ల హాజరు నమోదు.

మొబైల్ అటెండెన్స్ యాప్ను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో విజయవంతంగా హాజరు నమోదు

 సాంకేతికతను వినియోగించుకుని సులువైన పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్ ఫోన్లోనే హాజరు నమోదు విధానాన్ని అభివృద్ధిచేసిన ప్రభుత్వం... గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. హెచ్ఎఎస్ టెక్నాలజీ రూపకల్పన చేసిన యాప్ను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు శనివారం రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయ ఐటీ సమన్వయకర్త రమేష్ కుమార్.. డీఈవో కార్యాలయ ఐటీ సిబ్బందితో కలిసి పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ హైస్కూల్కు వెళ్లారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు స్మార్ట్ ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేయించారు. యాప్ ఓపెన్ చేసుకున్న ఉపాధ్యాయులు.. విద్యాశాఖ నిర్వహిస్తున్న టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో నమోదు చేసుకున్న సెల్ సంబర్ను ఎంటర్ చేసి, వ్యక్తిగత పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యారు. ఓపెన్ చేసిన యాప్లోకి సెల్ఫీ తీసుకునేలా చూడటం వల్ల ఫేసియల్ రికగ్నైజేషన్తో హాజరు నమోదు చేశారు. ఉదయం, సాయంత్రం కేవలం 30 సెకన్ల వ్యవధిలో ఉపాధ్యాయులు

తమంతట తాముగా స్మార్ట్ ఫోన్ ద్వారా హాజరు నమోదుచేసుకోవచ్చని రమేష్ కుమార్ చెప్పారు. పిడుగురాళ్ల పాఠశాలలో 36 మంది, సత్తెనపల్లి పాఠశాలలో 18 మంది చొప్పునఉపాధ్యాయులు విజయవంతంగా హాజరు నమోదు చేశారు.

Thanks for reading Record teachers' attendance by cell phones

No comments:

Post a Comment