AP MID LEVEL HEALTH Provider Jobs: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 4755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ నియామకాలను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టింది ఏపీలోని సీఎం జగన్ సర్కార్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
జోన్ ఖాళీలు
జోన్-1(విశాఖపట్నం) 974
జోన్-2(రాజమండ్రి) 1446
జోన్-3(గుంటూరు) 967
జోన్-4(కడప) 1368
మొత్తం: 4775
విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిజ్టర్ అయి ఉండాలి. ఇంకా కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే..
అభ్యర్థులు hmfw.ap.gov.in, cfw.ap.nic.in వెబ్ సైట్ల ద్వారా ఈ నెల 7 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎంపిక ఇలా..
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 6
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 7
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: ఏప్రిల్ 18
మెరిట్ లిస్ట్ ప్రచురణ: ఏప్రిల్ 20
అభ్యంతారల స్వీకరణకు ఆఖరి తేదీ: ఏప్రిల్ 23
ఫైనల్ మెరిట్ లిస్ట్ & ఎంపికైన అభ్యర్థుల వివరాల ప్రకటన: ఏప్రిల్ 25
అభ్యర్థుల ఎంపికపై అభ్యర్థుల స్వీకరణ: ఏప్రిల్ 26
తుది ఎంపిక వివరాల ప్రకటన: ఏప్రిల్ 27
కౌన్సెలింగ్: ఏప్రిల్ 28 నుంచి 30.
HMFW AP Recruitment 2022 – 4775 Mid-Level Health Provider Posts Notification
Online Notification: Click Here
Thanks for reading AP MID LEVEL HEALTH Provider Jobs
No comments:
Post a Comment