Railway Recruitment 2022 : రైల్వేలో 2972 అప్రెంటీస్ పోస్టులు . పదో తరగతి అర్హత .. వెంటనే అప్లై చేసుకోగలరు.
Eastern Railway Recruitment 2022:10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి మంచి అవకాశం వచ్చింది. ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 2972
మొత్తం 2972 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై మే 10, 2022 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి చదివితే మంచిది. చివరి తేదీ తర్వాత దరఖాస్తులు ఏవి అంగీకరించరని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
ఈ విభాగాల్లో ఖాళీలని భర్తీ చేస్తారు
1. హౌరా డివిజన్ – 659 పోస్టులు
2. లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు
3. సీల్దా డివిజన్ – 297 పోస్టులు
4. కంచరపర డివిజన్ – 187 పోస్టులు
5. మాల్డా డివిజన్ – 138 పోస్టులు
6. అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు
7. జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు
ఎలా దరఖాస్తు చేయాలి?
1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్– కి వెళ్లండి.
2. వెబ్‌సైట్‌లో ఉన్న హోమ్ పేజీలో నోటిఫికేషన్‌కి వెళ్లండి.
3. తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌కి వెళ్లండి.
4. అభ్యర్థించిన వివరాలను నింపడం ద్వారా దరఖాస్తు చేసుకోండి.
5. తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
అర్హత & వయో పరిమితి
ఈస్టన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదే సమయంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము
అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
Thanks for reading Eastern Railway Recruitment 2022
No comments:
Post a Comment