ఏపీ లో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది.
జులై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈఏపీసెట్, జూలై 13 వ తేదీన ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించనుంది ప్రభుత్వం.
అలాగే పిజిఎల్ సిఈటి, లాసెట్ పరీక్షలు కూడా జూలై 13 వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూలై 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పిజి ఈ-సెట్, జులై 22వ తేదీన ఈసెట్, జూలై 25 వ తేదీన ఐసెట్ పరీక్షలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఏపీ ఉన్నత విద్యా మండలి.
Thanks for reading Release of schedule of various entrance exams in AP


No comments:
Post a Comment