పదో తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
♦గతంలో కన్నా అదనంగా పరీక్షా కేంద్రాలు
♦హాజరుకానున్న 6.30 లక్షల మంది విద్యార్థులు
♦16 మందికి ఒక తరగతి గది
♦పరీక్షలకు జిల్లా పరిశీలకుల నియామకo
రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత జరగబో తున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కోవిడ్ ప్రభావం దాదాపుగా సమసిపోవడంతో ఈ నెల 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంతోపాటు, పదో తరగతి విద్యార్థులకూ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నెలాఖరు నుంచి జరగబోయే పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దాదాపు ఆరు లక్షల 30 వేల మంది ఈ ఏడాది పరీక్షలకు హాజరు కానున్నారు. అందుకు తగినట్లుగా అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు విద్యాశాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
♦పరీక్షా కేంద్రాల పెంపు...
మన దేశంలో, రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. ఈ ఏడాది పరీక్షలను కోవిడ్ నిబంధనలకు అనుగు ణంగా నిర్వహించనున్నారు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం భౌతిక దూరాన్ని పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఒక తరగతి గదిలో 24 మందికి నీటింగ్ ఏర్పాటు చేయగా.. ఈసారి 16 మందినే కూర్చోబెట్టాలని నిర్ణయించారు. తద్వారా కోవిడ్ నిబంధనలను పాటించడంతోపాటు, మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చూడొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటకు వచ్చిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రశ్నాపత్రాలు, పరీక్షానం తరం జవాబు ప త్రాలను భద్రపరిచే విషయంలోనూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు గతంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది. దాదాపు రెట్టింపునకు పైగా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 4 వేల రెండొందల కేంద్రాల్లో ఈసారి పరీక్షలు నిర్వహించనున్నారు.
♦ఏడు పేపర్లతో నిర్వహణ..
పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా వంద మార్కులకు పరీక్షలు నిర్వహించను న్నారు. గతంలో హిందీ సబ్జెక్ట్ మినహా అన్ని సబ్జెక్టులకు 50. మార్కులకు చొప్పున రెండేసి: పేపర్లు ఉండేవి. దీంతో విద్యార్థులు మొత్తం 11 పేపర్లు రాయాల్సి వచ్చేది. ఈ ఏడాది అలా కాకుండా ఏడు పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ మాత్రమే రెండు పేపర్లు ఉంటుంది. అలాగే బిట్ పేపర్ను విడిగా ఇచ్చే విధానం కూడా లేకుండా వంద మార్కులకు ప్రశ్నాపత్రాలు అందించనున్నారు..
♦టెన్త్ పరీక్షలకు జిల్లా పరిశీలకుల నియామకo
పదో తరగతి పరీక్షలకు జిల్లా పరిశీలకులను పాఠశాల విద్యాశాఖ నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శనివారం విడుదల చేశారు. అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికనే పరిశీలకులను నియమించారు. ఈ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నియమించిన్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై ఈ నెల 11వ తేదిన జిల్లా స్థాయి పరిశీలకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
♦పరిశీలకులు వీరే శ్రీకాకుళం-ఎం జ్యోతికుమారి (ఆరెడి విశాఖ), విజయనగరం-జి నాగమణి (ఎపిఎస్ఆఇఆర్ఎంసి జెడి), విశాఖపట్నం - ఎ సుబ్బారెడ్డి (అడిషనల్ డైరెక్టర్ ఎండిఎం), తూర్పు గోదావరి-డి మధుసూదన రెడ్డి (కాకినాడ ఆర్డి), కర్నూలు-కె రవీంద్రనాథ్ రెడ్డి (పరీక్షల విభాగం డైరెక్టర్), కృష్ణా ఎంఆర్ ప్రసన్నకుమార్ (గుంటూరు డిపిఎల్), గుంటూరు- విఎస్ సుబ్బారావు (గుంటూరు ఆర్డి), ప్రకాశం-పి పార్వతి (డైరెక్టర్ కోఆర్డినేషన్), నెల్లూరు - ఎం రామలింగం (జాయింట్ డైరెక్టర్), చిత్తూరు-బి ప్రతాప్ రెడ్డి (ఎసిఇఆర్టి డైరెక్టర్), కడప ఎంవి కృష్ణారెడ్డి (కడప ఆర్డి), పశ్చిమ గోదావరి-ఆర్ నరసింహారావు (ఎపిఆర్ఐ సొసైటీ కార్యదర్శి), అనంతపురం-కెవి శ్రీనివాసులు రెడ్డి (డైరెక్టర్ ఎపిఓఎస్ఎస్).
Thanks for reading Strong arrangements for tenth exams
No comments:
Post a Comment