Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, April 1, 2022

Systematic Investment Plan(SIP) .... how much to do?


 

సిప్ .... ఎంత చేయాలి?

క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో పెట్టుబడులు పెట్టినప్పుడు ఆర్థిక లక్ష్యాలన్నీ సులభంగా సాధించొచ్చు.. ఈ మాట ఎన్నోసార్లు వినే ఉంటారు.

ఆర్థిక ప్రణాళికలో 'సిప్‌' ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఇది కొంతమేరకు నిజమే. కానీ, ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న మరోటి ఉంది.. నెలకు ఎంత మొత్తం సిప్‌ చేస్తే మంచిది? దీనికి సమాధానం అందరికీ ఒకటిగానే ఉండదు. అవసరాన్ని బట్టి, దీర్ఘకాలిక లక్ష్యంతో, తగిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.

ప దిహేనేళ్ల తర్వాత మీకు రూ.1 కోటి అవసరం అనుకుందాం. మ్యూచువల్‌ ఫండ్లలో అధిక రాబడి వస్తుంది కాబట్టి, ఏదో కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ వెళ్తే.. ఈ లక్ష్యాన్ని సులభంగానే సాధించే అవకాశం ఉందని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది అనుకున్నంత సులువు కాదు. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో అంచనాల కన్నా ఆచరణ ప్రధానం.

నెలకు రూ.10వేల చొప్పున 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేశారనుకుందాం.. 10-12 శాతం రాబడి అంచనాతో మీకు వచ్చే మొత్తం రూ.41-50లక్షల మధ్య ఉంటుంది. ఇక్కడ దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని జమ చేసేందుకు సిప్‌ ఉపయోగపడిందనే చెప్పాలి.

కానీ, మీ లక్ష్యం 15 ఏళ్లలో రూ. కోటి. మరి దాన్ని సాధించే లక్ష్యానికి దూరంగా ఉండిపోయాం కదా..

దీనికోసం.. నెలకు రూ.20,000-రూ.24,000 వరకూ మదుపు చేస్తే.. కనీసం 10-12 శాతం రాబడి అంచనాతో.. 15 ఏళ్ల తర్వాత రూ. కోటి జమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే, దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన మొత్తాన్ని నిర్ణయించుకొని, దాన్ని మదుపు చేస్తూ వెళ్లాలి. కుదిరినప్పుడు మదుపు చేస్తాం.. లేకపోతే లేదు అంటే లక్ష్యం సాధించడం కష్టమే.

చాలామంది సిప్‌ను రూ.2వేలతో ప్రారంభిస్తుంటారు. అప్పుడు వారి సంపాదన రూ.30వేల వరకూ ఉండొచ్చు. కానీ, వారి ఆదాయం రూ.లక్షకు చేరుకున్నా ఈ రూ.2వేలు మాత్రం మారదు. ఇలా కాకుండా.. పెరుగుతున్న ఆదాయంతోపాటే సిప్‌ మొత్తాన్నీ పెంచుకోవాలి. ఏటా 5-10 శాతం పెట్టుబడిని పెంచడం వల్ల మంచి ఫలితాలు అందుకోవచ్చు. నెలకు రూ.10వేలతో ప్రారంభించి, ఏటా 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లారనుకోండి.. 15 ఏళ్లలో రూ.74-87 లక్షల వరకూ నిధి సమకూరుతుంది.

ఎంత మదుపు చేయగలం అనేది మన నియంత్రణలో ఉంటుంది. కానీ, ఎంత రాబడి వస్తుందనేది మన చేతుల్లో ఉండదు. ఇది పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. స్వల్పకాలంలో మార్కెట్‌లో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. వీటికి భయపడితే.. దీర్ఘకాలంలో వచ్చే రాబడి ఫలాలను కోల్పోతాం. అందుకే, సిప్‌ కనీసం 10 ఏళ్లకు పైనే కొనసాగిస్తానని నిర్ణయించుకున్నాకే ముందడుగు వేయాలి.

Thanks for reading Systematic Investment Plan(SIP) .... how much to do?

No comments:

Post a Comment