Young Professionals: సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 50 యంగ్ ప్రొఫెషనల్స్ ప్రభుత్వ ఉద్యోగాలు || చివరి తేది : మే 12 , 2022
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* యంగ్ ప్రొఫెషనల్స్ (జనరల్ మేనేజ్‌మెంట్)
మొత్తం ఖాళీలు: 50
అర్హత: ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.40000 - రూ.60000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, సంబంధిత పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.05.2022.
Thanks for reading Young Professionals Jobs in Sports Authority of India
No comments:
Post a Comment