Andhra News : ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు .. ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్, జూనియర్ స్థాయిలో అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
మొత్తం 17 మంది ఐపీఎస్‌ల పోస్టింగ్‌లలో మార్పు చేర్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు..
* ఎల్‌కేవీ రంగారావు - క్రీడలు, సంక్షేమం విభాగం ఐజీపీ, రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు.
* ఎస్వీ రాజశేఖర్ బాబు - ఆక్టోపస్ డీఐజీ, శాంతిభద్రతలు డీఐజీ (అదనపు బాధ్యతలు).
* పీహెచ్‌డీ రామకృష్ణ - ఏసీబీ డీఐజీ, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ (అదనపు బాధ్యతలు).
* కేవీ మోహన్ రావు - పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీ.
* ఎస్.హరికృష్ణ - విశాఖ రేంజ్ డీఐజీ(ప్రస్తుత హోదా), కోస్టల్ సెక్యూరిటీ డీఐజీ (అదనపు బాధ్యతలు).
* గోపీనాథ్ జెట్టి - గ్రేహౌండ్స్ డీఐజీ, న్యాయ వ్యవహారాల ఐజీపీ (అదనపు బాధ్యతలు).
* కోయ ప్రవీణ్ - 16వ బెటాలియన్ కమాండెంట్. ఆ స్థానంలో పనిచేస్తున్న డి.ఉదయభాస్కర్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు.
* విశాల్ గున్నీ - 6వ బెటాలియన్ కమాండెంట్ (ప్రస్తుత హోదా), విజయవాడ రైల్వే ఎస్పీ(అదనపు బాధ్యతలు).
* రవీంద్రనాథ్ బాబు - కాకినాడ జిల్లా ఎస్పీ (ప్రస్తుత హోదా), ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ (అదనపు బాధ్యతలు).
* అజితా వేజేండ్ల - అనంతపురంలో 14వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ (ప్రస్తుత హోదా), గుంతకల్ రైల్వే ఎస్పీ (అదనపు బాధ్యతలు). ఆ స్థానంలో పనిచేస్తున్న పి. అనిల్ బాబును పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ.
* జి.కృష్ణకాంత్ - రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్.
* పాడేరు అదనపు ఎస్పీ పి.జగదీశ్ చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ.
* తుహిన్ సిన్హా - పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బదిలీ.
* బిందు మాధవ్ గరికపాటి - పల్నాడు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ.
* పీవీ రవికుమార్ - విజిలెల్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా బదిలీ.
Thanks for reading Andhra News: Transfers of IPS officers in Andhra Pradesh
No comments:
Post a Comment