Cyclone Asani : తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన ' అసని '
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుపాను 'అసని' తుపానుగా బలహీన పడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో 'అసని' కదులుతోంది. నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి తుపాను రానుంది. కాకినాడ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు సాయంత్రానికి వాయుగుండంగా తుపాను బలహీనపడనుంది. తీరానికి అతిదగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. తుపాను కారణంగా 3 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
తుపాను ప్రభావంతో ఇవాళ ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉందని విప్తతు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75- 95 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సహయక చర్యల కోసం 9 ఎస్డీఆర్‌ఎఫ్, 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు తుపాను నేపథ్యంలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, బాపట్ల తదితర తీరప్రాంత జిల్లాలోని మండలాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. బుధవారం సాయంత్రం తుపాను తీరం దాటే వీలుండడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని వీలుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకిన అనంతరం మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తుండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
ఒంగోలు కలెక్టరేట్..
కమాండ్ కంట్రోల్ నం: 1077
విద్యుత్తు స్తంభాలు విరిగిపడినా, లైన్లు తెగిపడినా తక్షణమే చేయాల్సిన ఫోన్ నం: 1912
పోలీస్ వాట్సాప్ నంబర్: 91211 02266
బాపట్ల కలెక్టరేట్..
కమాండర్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 8712655878, 8712655881, 8712655918
ఎన్టీఆర్ జిల్లా..
కంట్రోల్ రూమ్ నెంబర్..90103 13920
Thanks for reading Cyclone Asani: 'Asani' weakened by severe storm
No comments:
Post a Comment