Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 31, 2022

Did you know that the new charge will come into effect from June 1?


 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఛార్జీలేంటో తెలుసా ?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State bank of india) గృహ రుణ(home loan) వడ్డీ రేట్ల నుంచి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం వరకు కొన్ని విభాగాలలో..

వినియోగదారునిపై జూన్ 1 నుంచి ఆర్థిక భారం పెరగనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్..

గృహ రుణ వడ్డీ రేట్లను పెంచిన ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. గృహ రుణ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్‌)ని 40 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. దీంతో గృహ రుణ వడ్డీ రేటు 7.05 శాతానికి చేరనుంది. రేపో లింక్డ్‌ లెండింగ్ రేటు 6.65 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం ఈబీఎల్ఆర్ 6.65 శాతం ఉండగా, ఆర్ఎల్ఎల్ఆర్ 6.25 శాతంగా ఉంది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, పెరిగిన వడ్డీ రేట్లు జూన్ 1, 2022 నుండి అమలులోకి రానున్నాయి.

యాక్సిస్ బ్యాంక్ ఛార్జీలు..

యాక్సిస్ బ్యాంక్ పొదుపు, శాలరీ ఖాతా సేవా రుసుములను పెంచనుంది. సెమీ అర్బన్/గ్రామీణ ప్రాంతాలలోని ఖాతాదారులు నెలవారీగా నిర్వహించాల్సిన సగటు బ్యాలెన్స్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. లేదా రూ.1 లక్ష టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ పాటించని వారికి విధించే పెనాల్టీ ఛార్జీలను కూడా 7.50 శాతం మేర పెంచనుంది. ఈ కొత్త రూల్స్‌ జూన్ 1 నుంచి వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది.

థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపు..

వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్ బీమా ప్రీమియంను పెంచుతూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్‌ ప్రకారం..

ద్విచక్ర వాహనాలకు..

ఇంజిన్‌ సామర్థ్యం 75 సీసీ కంటే తక్కువ ఉన్న ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియం రూ.538 గానూ, 75 సీసీ పైన 150 సీసీకి మించని వాటికి రూ.714 గానూ, 150 సీసీ పైన 350 సీసీ మించని వాటికి రూ.1366 గానూ, 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉండే బైక్‌లకు ప్రీమియం రూ.2,804 గానూ ఉండనుంది.

నాలుగు చక్రాల వాహనాలకు ..

1000 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల ప్రీమియంను రూ.2094 గానూ, 1000 సీసీ పైనా 1500సీసీ మించకుండా ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల బీమా ప్రీమియం రూ.3,416 గానూ, 1500సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న కార్ల ప్రీమియం రూ.7,890గానూ ఉండనుంది.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) సర్వీస్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. AePS లావాదేవీలు చేసేవారు ఈ ఛార్జీలను చెల్లించాలి. కొత్త ఛార్జీలు జూన్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. నగదు ఉపసంహరణ, డిపాజిట్‌, మిని స్టేట్ మెంట్ వంటి వాటికి ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రతీ నెలా మొదటి మూడు లావాదేవీలు ఉచితంగానే లభిస్తాయి. ఆ తర్వాత క్యాష్ డిపాజిట్‌, విత్‌డ్రాలకు రూ.20+జీఎస్‌టీ, మినీ స్టేట్‌మెంట్ కి రూ.5+జీఎస్‌టీ వర్తిస్తుంది.

Thanks for reading Did you know that the new charge will come into effect from June 1?

No comments:

Post a Comment