Aadhaar Card : ఆధార్ జిరాక్స్ హెచ్చరికపై వెనక్కి తగ్గిన కేంద్రం
దుర్వినియోగానికి ఆస్కారం లేదని వివరణ
ఆధార్ కార్డు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మాస్క్‌డ్ కార్డు ఫొటోకాపీ (జిరాక్స్)ని మాత్రమే ఇవ్వాలంటూ జారీ చేసిన మార్గదర్శకాలకు కేంద్రం ఉపసంహరించుకుంది.
ఇటీవల కొందరు వ్యక్తులు ఆధార్ కార్డులకు ఫొటోషాప్‌లో మార్పులు చేసి దుర్వినియోగం చేశారని తెలిపింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని బెంగళూరులోని స్థానిక యూఐడీఏఐ కార్యాలయం సదరు మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపింది. అలాంటి చర్యలను అరికట్టడంలో భాగంగానే ఆ పత్రికా ప్రకటన జారీ చేయాల్సి వచ్చిందని వివరించింది.
అయితే, దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ఆధార్ వినియోగంలో పౌరులు పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఆధార్‌లోని వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. అనధీకృత వ్యక్తులు, సంస్థలు ఆధార్‌లో గోప్యంగా ఉండే వివరాలను పొందే అవకాశం లేదని తెలిపింది. యూఐడీఏఐ వ్యవస్థను అంత పటిష్ఠంగా రూపొందించామని పేర్కొంది.
Thanks for reading Explanation for abuse of Aadhaar Card
No comments:
Post a Comment