Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, May 19, 2022

Highlights of the review meeting with CM Jagan and officials@ 19.05.22


 

Highlights of the review meeting with CM Jagan and officials@ 19.05.22

విద్యాశాఖపై సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు.

నాడు-నేడుతో పాటు విద్యాశాఖకు సంబంధించి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు, పనుల ప్రగతిపై ప్రధానంగా చర్చించారు. ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు ప్రక్రియపై సీఎంకు అధికారులు వివరించారు. రూ.8 వేల కోట్లతో సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద సమూల మార్పులు చేపడుతున్నామన్నారు. ఈ నెల 20న గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ ను లాంఛ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇంగ్లీషు అభ్యసనం, ఫొనిటిక్స్‌ కోసం ఈ ప్రత్యేక యాప్‌ రూపొందించినట్లు సీఎంకు చెప్పారు. ఈ యాప్‌ సమగ్రమైన ఇంగ్లిషు భోధనకు ఉపయోగకరంగా ఉంటుందన్న అధికారులు.గూగుల్‌ సహకారంతో యాప్‌ను రూపొందించామని సీఎంకు వివరించారు.

ఇక అమ్మఒడి పథకం కింద నగదుకు బదులుగా 8.21 లక్షల మంది విద్యార్ధులు లాప్‌ టాప్‌ ఆప్షన్‌ ఎంచుకున్నారని సీఎంకు తెలిపారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటివరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలిచ్చారు. నాడు-నేడు రెండో దశ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 23,975 వేల స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు చేపట్టామని.., నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండోదశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుమద్ద కార్యక్రమాలపై మరింత ధ్యాస పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమర్ధవంతంగా, నాణ్యతతో అమలు చేయాలి, అప్పుడే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటామని చెప్పారు. టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుముద్ద అమలను మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో ఆలోచన చేయాలని ఆదేశించారు.

గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్‌ కళాశాలలు మాత్రమే ఉండేవని., ఇప్పుడు ఏకంగా 1200 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్ని జగన్ చెప్పారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కళాశాల లేదా కేజీబీవీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా విస్తృతంగా చెప్పాలని.., తద్వారా వినియోగించుకునే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, బాత్రూమ్‌ల నిర్వహణ వంటివి సమర్ధవంతంగా నిర్వహించాలని.., దీని కోసం పక్కాగా ఎస్‌ఓపీలు ఉండాలన్నారు జగన్.

జగనన్న విద్యాకానుక కిట్‌ నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని సీఎం స్పష్టం చేశారు. పంపిణీకి సర్వం సన్నద్ధంగా ఉండాలన్న సీఎం.., జూలై 4 నాటికి జగనన్న విద్యాకానుక ప్రారంభం కావాలన్నారు. అలాగే జూన్‌లో అమ్మఒడి కార్యక్రమం అమలుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు.

Thanks for reading Highlights of the review meeting with CM Jagan and officials@ 19.05.22

No comments:

Post a Comment