1998 DSC చరిత్ర
1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో అతి పెద్ద డీఎస్సీ)
ఆ సమయంలో అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి.. ఓసీలకు 50, బీసీలకు 45; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 221 జీవోను జారీ చేసింది. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 విడుదల చేసింది.
అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఆయా జిల్లాల్లో తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం ఇలా రెండు జీవోలు జారీచేయడంతో.. మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత.. 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది.
కాని అధికారుల పొరపాటుతో ఎక్కువ కటాఫ్, తక్కువ కటాఫ్ ఉన్న రెండురకాల అభ్యర్థులను ఒకేసారి ఇంటర్వ్యూలకు పిలిచారు. దీంతో 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదు. దీంతో వీరంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
(ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను రద్దు చేసేశారు తెలంగాణలో 2015 ఆంధ్రప్రదేశ్ లో 2020)
పలు దఫాలుగా అభ్యర్థుల వాదనలు విన్న ట్రైబ్యునల్ వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2009లో ఆదేశాలు జారీచేసింది. 2011లో హైకోర్టు కూడా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే డీఎస్సీ నియామకాలకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అమలుకాకపోవడంతో అభ్యర్థులు చివరగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ-1998 మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని కచ్చితంగా ఆదేశించింది
ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం తో 1998 DSE క్వాలిఫైడ్ అభర్ధులకు మోక్షం కలుగబోతుంది
📚విరమణ వయసులో కొలువు
♦️55 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం
♦️డీఎస్సీ1998 బ్యాచ్‌లో శ్రీకాకుళం వాసికి చాన్స్
ప్రస్తుతం భిక్షాటన చేస్తూ దీనస్థితిలో
మెళియాపుట్టి/పాతపట్నం,
చిన్నప్పటి నుంచి చదువంటే మక్కువ. బీఈడీ పూర్తి చేశాడు. టీచర్ కావాలనేది ఆయన కోరిక. అయితే తృటిలో ఉద్యోగం తప్పిపోయింది. కులవృత్తి కూడా కలిసి రాలేదు. ప్రస్తుతం భిక్షాటన చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో కొందరు యువకులు ఆయనకో శుభవార్త చెప్పారు. అదేంటంటే.. ఆయనకు టీచర్ ఉద్యోగం వచ్చింది. అయితే ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు. ఉద్యోగం జీవితకాలం లేటంటూ ఆయన నిట్టూర్చాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టారు. 1994 డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. 1998లో డీఎస్పీ రాసినా వివాదాలతో నిలిచిపోయింది. దీంతో ఉద్యోగం రాదని భావించిన ఆయన సైకిల్‌పై చేనేత వస్త్రాలు విక్రయించడం ప్రారంభించారు. అది కలిసి రాలేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంతో చనిపోయారు. తోబుట్టువులు ఇద్దరు ఉన్నా కేదారేశ్వరరావు మానసిక స్థితిని చూసి విడిచిపెట్టారు. దీంతో ఆయన కడుపు నింపుకొనేందుకు పాతపట్నం పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటున్నారు. కాగా ఇటీవల కోర్టు చిక్కుముడులు వీడి డీఎస్సీ-1998 క్వాలిఫై జాబితాను అధికారులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. కానీ ఆయనకు ఎటువంటి సమాచారం లేదు. గ్రామానికి చెందిన యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. తనకు ఈ విషయం తెలియదని, 23 ఏళ్లు గడిచిపోయిందంటూ కేదారేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Thanks for reading 1998 DSC History
No comments:
Post a Comment