Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 7, 2022

Drinking chamomile tea or chamomile tea can help control sugar.


 చమోమిలే టీ లేదా చామంతి టీ తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందట.

ప్రస్తుత రోజుల్లో లైఫ్ స్టైల్ మారడంతో ఇంట, బయటా మనుషులపై ఒత్తిడి అధికంగా ఉంటోంది. శారీరకంగా పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మానసికంగానూ ఉంటుంది. దీంతో నిద్ర సరిగ్గా పట్టే అవకాశం ఉండదు. అందుకే చమోమిలే టీని డైట్‌లో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చమోమిలే టీని చామంతి టీ అని కూడా అంటారు.

చామంతి టీ అనేది ఔషధాల టీ. చామంతి పూలను దశాబ్దాల క్రితం నుంచి ఆయుర్వేద వైద్యులు మూలికా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడి తగ్గించడానికి ఒక కప్పు చామంతి టీ అద్భుతంగా పనిచేస్తుంది. చామంతి పూలతో తయారుచేసే టీ మంచి సువాసనతో పూల రుచిని కలిగి ఉంటుంది. చామంతి టీ పలు అనారోగ్య సమస్యలకు చక్కగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

​ఎంపిక ఇలా

గడ్డి లేదా సీమ చామంతి పూలతో ఈ టీని తయారుచేస్తారు. చామంతి టీ కొనేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే కల్తీ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే చామంతి టీ ప్యాకెట్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుని మంచి కంపెనీవి ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం చామంతి టీ సైతం బ్యాగుల రూపంలో లభిస్తోంది. కాబట్టి మంచి బ్రాండ్ ఎంచుకొంటె అన్నివిధాలుగా మంచిది.

​రక్తంలో చక్కెర స్థాయిలు దూరం

చామంతి టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బరువు పెరగడం తరచుగా ఆందోళన కలిగించే విషయం. చామంతి పూల టీలో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా అధిక బరువుకు చెక్ పెడుతుంది. ఎరేటెడ్ పానీయాలను ఆరోగ్యకరమైన చామంతి టీతో భర్తీ చేయవచ్చు. దీంతో శరీరంలో అధిక కేలరీలు తగ్గడమే కాకుండా చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

ఆందోళన దూరం

ప్రజలు సాధారణంగా నిద్రపోయే ముందు చమోమిలే టీని తీసుకుంటారు. ఎందుకంటే దాని స్వభావం నిద్ర ప్రేరేపిస్తుంది. కానీ నిద్రకు సహాయం చేయడమే కాకుండా ఆందోళన లేదా ఒత్తిడి వల్ల కలిగే మానసిక స్థితిని చామంతి టీ మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళనే కలిగించే లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.

​రుతుస్రావం సమయంలో నొప్పి.

చమోమిలే టీలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు రుతుస్రావం సమయంలో మహిళల్లో కలిగే నొప్పి తగ్గించడానికి సహాయపడతాయి. ఒక కప్పు చామంతి టీ తాగడం వల్ల గర్భాశయంలో కలిగే మంట మరియు నొప్పికి కారణమయ్యే స్రావాల ఉత్పత్తి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

​చుండ్రు సమస్య.

జీవనశైలిలో మార్పులు, వాతావరణ ప్రభావం కారణంగా నేటి తరం యువతులు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చుండ్రు. చామంతి టీ చుండ్రు, దాని కారణంగా వచ్చే దురద సమస్యలకు చెక్ పెడుతుంది. హెన్న ఫేస్ మాస్కులో చామంతి టీ కలిపి దాన్ని తలకు అప్లై చేసుకోవాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది. జుట్టుకు తరచూ రంగులు వేసుకునే వారు చామంతి టీతో సహజసిద్ధంగా వాటిని మీ కురులకు అందించవచ్చు. బంగారు వర్ణంలో మీ కురులు మెరిసిపోవాలంటే.. తలస్నానం చేసిన తర్వాత కప్పు చామంతి టీతో జుట్టును కడగాలి. బ్రౌన్ రంగు జుట్టు కావాలనుకొంటే.. చామంతి టీతో హెన్నా కలిపి దాన్ని తలకు అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

​జలుబు లక్షణాలకు చికిత్స

చలికాలంలో జలుబు చేయడం సాధారణ విషయం. ఇలాంటి సమయంలో వేడి వేడిగా చామంతి టీ తాగితే జలుబు చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. చామంతి టీ ఆవిరిని పీల్చినా మంచి ప్రయోజనం కలుగుతుంది. ముక్కు కారటం, గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా చామంతి టీ అద్భుతంగా సహాయపడుతుంది.

​నిద్రలేమితో దూరం

మీరు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటే చమోమిలే టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ నిద్రను ప్రేరేపించడంలో ఎంతో సహాయపడుతుంది. అందుకే చామంతి టీ తాగితే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరెన్నో ఉపయోగాలు

చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపు లక్షణాలు తగ్గిస్తాయి. కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రతిరోజు కప్పు చామంతి టీ తాగితే చాలా మంచిది.

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. బరువు తగ్గాలనుకొనేవారికి సైతం చామంతి టీ మంచి ప్రత్యామ్నాయం.

చామంతి టీ గుండెకు మేలు చేస్తుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి చామంతి టీ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం.

భోజనం చేసే ముందు చామంతి టీ తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. చామంతి టీ రోజూ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

కప్పు చామంతి టీ జలుబుకు గొప్పగా పనిచేస్తుంది. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, జలుబు లక్షణాలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి.

ఒక కప్పు చామంతి టీ ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి దోహం చేస్తుంది.

అందం,. ఆరోగ్యం విషయంలో ఎన్నో ప్రయోజనాలున్న ఈ వలన కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అలర్జీ ఉన్నతికి ఈ మంచిది కాదు.. అంతేకాదు ఈ టీని రోజుకి ఒకటి కంటే ఎక్కువ సార్లు తాగితే వాంతులు అయ్యే అవకాశం ఉంది. గర్భం దాల్చిన మహిళలు, పాలిచ్చే తల్లులు, రక్తం గడ్డకుండా మాత్రలు ఉపయోగించేవారు చామంతి టీ తాగాలనుకొంటే ముందు వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి. 

తయారు చేసే విధానం

ముందుగా గిన్నెలో నీరు తీసుకొని నీటిని బాగా వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత ఆ నీటిలో రుచికి సరిపడే బెల్లం వేయాలి. తర్వాత ఆ మరుగుతున్న నీటిలో కొద్దిగా ఎండబెట్టిన చామంతి పూలను వేసి గిన్నెపై మూత పెట్టి రెండు నుంచి పది నిమిషాల పాటు తక్కువ సెగపై మరగనివ్వాలి. టీ చిక్కగా కావాలంటే ఎక్కువ సమయం మ‌రిగించాలి. మీకు నచ్చిన మోతాదులో రంగు, వాసన వచ్చిన తర్వాత వడపోసి నిమ్మరసం కలిపి టీ తాగాలి. కావాలనుకొంటే.. తీపి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు.


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Thanks for reading Drinking chamomile tea or chamomile tea can help control sugar.

No comments:

Post a Comment