Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 21, 2022

Highlights of today's meeting of the Minister of Education with recognized associations


 ఈరోజు గుర్తింపు పొందిన సంఘాలతో విద్యాశాఖ మంత్రి గారి సమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు



ఈరోజు గుర్తింపు పొందిన సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ B. రాజశేఖర్, కమిషనర్ S. సురేష్ కుమార్, SPD ఎ ట్రీ సెల్వి, జేడీ సర్వీసెస్ రామలింగం , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప రెడ్డి గార్ల తో సమావేశం జరిగింది .ఈసమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు.


ఈరోజు గుర్తింపు పొందిన సంఘాలతో విద్యాశాఖ మంత్రి గారి సమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు  


 **విద్యా హక్కు చట్టం లో గాని ,జాతీయ విద్యా విధానంలో గాని పాఠశాల విలీనం లేదా విభజన అంశం లేదు కనుక ఈ ప్రక్రియ చేపట్టడం సరైన విధానం కాదని స్పష్టంగా చెప్పాము.


*ప్రతి ప్రాథమిక పాఠశాల కు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని


* పాఠశాల విద్యలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని,


* ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులను,వ్యాయామఉపాద్యాయులను కొనసాగించాలని.


* ప్రాథమికొన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు కొనసాగించాలని,


* ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల వర్క్ లోడ్ 32 పీరియడ్స్ కి మించకుండా చూడాలని ,


*మైనర్ మీడియం స్కూల్ లను ఇతర మీడియం  స్కూల్ లలో విలీనం చేయరాదని,

*SA హిందీ, సెక్షన్ ల ఆధారం గా కాకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయింపు చేయాలని,


*SA పోస్టులను సెక్షన్ల ఆధారంగా కాకుండా తెలుగు,ఇంగ్లీషు మీడియం ఆధారంగా కేటాయింపు చేయాలని,


** ప్రాథమిక పాఠశాల లలో 1:20; ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1: 35 ;ఉన్నత పాఠశాల 1:40 గా  నిర్ణయించాలని 


**ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 80కి పైగా బడిన పాఠశాలలకు పి ఎస్ హెచ్ ఎం పోస్టులు మంజూరు చేయాలని,


 **పి ఎస్ హెచ్ ఎం పోస్ట్ని బలవంతంగా  స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ గా మార్పు చేయరాదని,


* అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ కల్పించాలని,


* గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపల్ గా ప్రమోషన్లు కల్పించాలనికోరాము..


**బదిలీలకు సంబంధించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరాము.


***మనతో పాటు మిగిలిన సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వారం లోపు తగు నిర్ణయం చేస్తామని మంత్రి గారు తెలిపారు.


 ****విధానపరమైన అంశాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.అలాగే GO 117 పై పరిశీలిస్తామని చెప్పారు...

Thanks for reading Highlights of today's meeting of the Minister of Education with recognized associations

No comments:

Post a Comment