Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 14, 2022

If you are worried about buying online ... check these out before buying ..


Online లో కొన్నాక బాధపడొద్దంటే ... కొనేముందు ఇవి చూడండి ..

కొన్నాక బాధపడొద్దంటే..!

కొనుగోళ్లన్నీ ఆన్‌లైనే! ఎంతో ముచ్చటపడి కొంటామా.. ఒకటి, రెండు ఉతుకులకే పాడవుతుంటాయి కొన్ని. కొన్నేమో రెండోసారికే వేయబుద్దేయదు. డబ్బు వృథా, అసంతృప్తి. వీటినుంచి తప్పించుకోవాలా? నిపుణులేం చెబుతున్నారంటే...

లోపల చూడాలి.. ఆకర్షణ సరే... నాణ్యత తెలియాలంటే లోపల చెక్‌ చేయాలి. అంచుల నుంచి దారాలు ఊడుతున్నాయా? లాకింగ్‌ సరిగా ఉందా? చూడాలి. పక్కల కుట్టు అంచులకు మరీ దగ్గరగా ఉండొద్దు. లేదంటే చిన్నగా లాగినా పిగులుతుంది. చిన్న కుట్టు.. మన్నికకు చిహ్నం. ఇవన్నీ చూసుకోవాలి.

ట్యాగ్‌ చూశారా? దుస్తుల లోపల ట్యాగ్‌లను పరిశీలిస్తే అదెక్కడ తయారైంది, శుభ్రం చేసే పద్ధతి ఉంటాయి. ఉదాహరణకు డ్రైక్లీనింగ్‌ మాత్రమే అని ఉందనుకోండి. మీరేమో నీటిలో ఉతికేశారు. డ్రెస్‌ పాడవుతుంది కదా!

హాయినివ్వాలి.. సాధారణంగా సైజు, రంగులే చూస్తాం! కానీ చర్మానికీ హాయినిస్తేనే ప్రయోజనం. వస్త్రంతో చేతి వెనుక లేదా మెడ మీద మృదువుగా రుద్దండి. మంట పుట్టినా, బరకగా తగిలినా.. ఎక్కువ కాలం వాడలేరు.  మృదువుగా, హాయిగా అనిపిస్తే ఎంపిక సబబే.

ధర తగునా.. కొన్నిసార్లు వస్త్ర వివరాల్లో విదేశీ పేర్లు కనిపిస్తాయి. ధరేమో తక్కువ కనిపిస్తుంటుంది. ఒక వస్త్రం అంత దూరం నుంచి రావాలంటే ఎంత ఖర్చు? తక్కువకే వస్తోందంటే నాణ్యతలో సమస్య ఉన్నట్లేగా! అలా అని మరీ ఖరీదైతే నాణ్యమైనదే అనుకోవద్దు. కాస్త సమయం తీసుకున్నా.. ఆ సంస్థ వివరాలను వెతకండి. ప్రమాదం లేదు అని రూఢీ అయితేనే తీసుకోండి. ఇవన్నీ పరిశీలించుకున్నాక సంతృప్తి చెందితే భేషుగ్గా అట్టిపెట్టుకోండి. లేదూ.. వెనక్కి పంపేయండి.

Thanks for reading If you are worried about buying online ... check these out before buying ..

No comments:

Post a Comment