Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, June 30, 2022

Memo No. ESE02-27021/21/ 2022-MDM-CSE Dated:30/06/ 2022 SOP for staff of Village Secretariate/Ward Secretariate to visit the schools


 Memo No. ESE02-27021/21/ 2022-MDM-CSE Dated:30/06/ 2022 SOP for staff of Village Secretariate/Ward Secretariate to visit the schools


 విలేజ్/ వార్డు సెక్రటరీ స్టాఫ్ పాఠశాలల మీద పర్యవేక్షణ కొరకు sop విడుదల. ఎవరెవరు ఏమేమి పర్యవేక్షిస్తారు Guidelines విడుదల చేయడం జరిగింది.

*✨ సచివాలయ కార్యదర్శులకు*

  *గోరుముద్ద, టీఎంఎఫ్‌ బాధ్యతలు

*మహిళా పోలీసుల పాత్ర*

► ఎమర్జెన్సీ నెంబర్లయిన 112, 100లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పాఠశాల పిల్లలకు పోలీసుల సహకారం అందుబాటులో ఉండేలా ఉపయోగకరమైన మెటీరియల్‌ని అందించాలి. పాఠశాలలను నెలనెలా సందర్శిస్తూ, అవగాహన శిబిరాలు నిర్వహించాలి. 


*విద్యా, సంక్షేమ కార్యదర్శి పాత్ర*

► వారానికి మూడుసార్లు పాఠశాలలను సందర్శించి గోరుముద్ద నాణ్యతను పరిశీలించాలి. ఐఎంఎంఎస్‌ యాప్‌లో ఫీడ్‌బ్యాక్‌ రాసి ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. రికార్డులు, రిజిస్టర్‌ల నిర్వహణను పరిశీలించాలి. పాత్రల పరిశుభ్రతను గమనించి హెచ్‌ఎంలకు సహకరించాలి. అలాగే, తల్లిదండ్రుల కమిటీతో చర్చించాలి. టాయిలెట్లు, వాష్‌బేసిన్లు, యూరినల్స్‌ ఇతర అనుబంధ వస్తువుల శుభ్రతను గమనించాలి. యాప్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి.


*ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పాత్ర*

► పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం హెడ్మాస్టర్, పేరెంట్స్‌ కమిటీ సభ్యులతో కలిసి ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ నెలకొకసారి పాఠశాలను సందర్శించాలి. ఫీడ్‌బ్యాక్‌ను డేటాబేస్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు అవసరమైన పరికరాలు, క్లీనింగ్‌ మెటీరియల్‌ను పరిశీలించాలి. మరమ్మతులు చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ భౌతికంగా అందుబాటులో ఉండాలి.


*ఏఎన్‌ఎమ్‌ పాత్ర*

► ఆశా, జీఎస్‌డబ్ల్యూఎస్‌ సిబ్బందితో పాటు ఏఎన్‌ఎంలు నెలవారీగా పాఠశాలలను సందర్శించాలి. పిల్లల ఎత్తు, బరువు వయస్సుకు తగిన పెరుగుదలను తనిఖీ చేయాలి. పిల్లల రక్తహీనత లక్షణాలు గుర్తించాలి. బలహీనంగా ఉన్న వారి పర్యవేక్షణ నిమిత్తం సిబ్బందికి సూచనలు చేయాలి. మురుగునీరు నిలవ ఉండకుండా చూడాలి. మంచినీరు, పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలి. 

Click Here To Download Proceedings

Thanks for reading Memo No. ESE02-27021/21/ 2022-MDM-CSE Dated:30/06/ 2022 SOP for staff of Village Secretariate/Ward Secretariate to visit the schools

No comments:

Post a Comment