సచివాలయ సిబ్బందికిపాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు, 'నాడు-నేడు' పనులు, మధ్యాహ్న భోజన పథకం, జగనన్న విద్యాకానుక పంపిణీ, అమ్మఒడి పథకం, పాఠశాల భద్రత, ఆరోగ్యం కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించింది. వార్డు, గ్రామ సంక్షేమ, విద్య సహా యకులు, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, మహిళా పోలీసు, ఇంజినీర్, వార్డు వసతుల కల్పన కార్యద ర్శులకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల హాజరు, నాడు-నేడు, మధ్యాహ్న భోజనం, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక పథకాల పర్యవేక్ష ణను విద్య సహాయకులు, డేటా ప్రాసెసింగ్ కార్య దర్శికి అప్పగించారు. వారంలో ఒక రోజు పాఠ శాల, విద్యార్థుల ఇంటికి వెళ్లాలని, తల్లిదండ్రుల కమిటీ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశిం చింది. పాఠశాల, కళాశాలల్లో భద్రత, బాల్య వివా హాలు, మత్తుపదార్థాలపై అవగాహన కల్పించా లని, పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇంజినీర్లు నాడు-నేడు, పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధులను పర్య వేక్షించాలని పేర్కొంది.
Thanks for reading Supervision of schools by Secretariat staff
No comments:
Post a Comment