Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 25, 2022

AP EAPCET-2022 exam results will be released on 26th July


AP EAPCET-2022 exam results will be released on 26th July

 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించిన‌ ఏపీ ఈఏపీసెట్‌–2022 పరీక్షల ఫ‌లితాల‌ను జూలై 26వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ ఫ‌లితాల‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌య‌వాడ‌లో ఉద‌యం 11:00 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఏపీ ఈఏపీసెట్‌–2022 జూలై 4వ తేదీన‌ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు తెలంగాణ‌ విద్యార్థులు కూడా హాజ‌ర‌య్యారు.

ఫ‌లితాల కోసం 3,00,084 మంది విద్యార్థులు..

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల కోసం ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష నిర్వ‌హించారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ ఉండదు. సెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటించ‌నున్నారు. 2020లో 2.60 లక్షల మంది, 2021లో 2.73 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015–16 నుంచి జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా 2016–17లో 2.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకు మించి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 

       తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అలాగే AP EAPCETలో వ‌చ్చే ర్యాంక్‌ల‌పై విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో  ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Important Links for AP EAPCET (Engineering) 2022 RESULTS:-

Official websiteClick Here
EenaduClick Here
SakshiClick Here
SakshiClick Here
ManabadiClick Here


Important Links for AP EAPCET (Agriculture & Pharmacy) 2022 Results:-

Official websiteClick Here
EenaduClick Here
SakshiClick Here
SakshiClick Here
ManabadiClick Here

Thanks for reading AP EAPCET-2022 exam results will be released on 26th July

No comments:

Post a Comment