BASELINE TEST INSTRUCTIONS
👉ప్రథమ్ ఫౌండేషన్ వారు సూచించిన టెస్టింగ్ టూల్స్ ఆధారంగా రూపొందించిన ప్రశ్నా పత్రాలతో అన్ని ప్రభుత్వ (GOVT' ZP, MUNICIPAL, APMS, KGBV, WELFARE SCHOOLS) మరియు ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలలో తేది 22.07.22 న బేస్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
👉బేస్లైన్ టెస్ట్ రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు నిర్వహించాలి.
👉ప్రశ్నా పత్రాలు సమగ్ర శిక్ష నుండి అందించబడతాయి.
👉పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను మరియు ఇతర మెటీరియల్ ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి.
👉ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పేజీల ఇన్స్ట్రుక్షన్స్ బుక్లెట్లు ఇవ్వబడతాయి.
👉మరో ఐదు పేజీల ఓరల్ టెస్టింగ్ టూల్స్ ప్రశ్నా పత్రం ఇవ్వబడతాయి
👉ప్రతి విద్యార్థికి పెన్ వినియోగించి వ్రాయ వలసిన నాలుగు పేజీల టెస్టింగ్ టూల్ ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది.
👉ఇవి పది సెట్స్ లో ఇవ్వబడతాయి.
👉వీటిని విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మొదటి విద్యార్దికి సెట్ 1, రెండవ విద్యార్థికి సెట్ 2, మూడవ విద్యార్థికి సెట్ 3, ..... వరుస క్రమంలో ఇవ్వాలి.
👉మొదటి పదిమంది విద్యార్థులకు వరుసక్రమంలో పది సెట్లు ఇచ్చిన తరువాత పదకొండవ విద్యార్థి నుండి మరల సెట్ 1 నుండి ప్రారంభించి ఇవ్వాలి.
👉తెలుగు, ఇంగ్లీష్ , గణితంలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి.
👉బేస్లైన్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది.
👉మొదటిది మౌఖిక పరీక్ష. రెండవది రాత పరీక్ష.
👉రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నా పత్రం ద్వారా మౌఖిక పరీక్ష జరపాలి.
👉మొదటి రోజు తెలుగు, రెండవ రోజు ఇంగ్లీష్ , మూడవ రోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.
👉మౌఖిక పరీక్ష కొరకు ప్రతి పాఠశాలకు రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి.
👉ప్రతి శాంపిల్ నందు ఐదు స్థాయిలు ఉంటాయి.
👉అవి తెలుగు నందు :- ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథ స్థాయి.
👉గణితం నందు :- ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు, గణిత ప్రక్రియలు
👉ఇంగ్లీష్ నందు :- ప్రారంభ స్థాయి, కాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పదాలు, వాక్యాలు
👉విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించాలి.
👉ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పిలిచి, చదివించి వారి స్థాయిని నిర్ధారణ చేయాలి.
👉మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.
ముఖ్య గమనిక
👉మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.
👉రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది.
👉గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.
👉ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.
👉రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి.
👉అవి
1. అసలు ఏమీ రాయని / చేయని వారు
2. ప్రయత్నిచారు కానీ అన్నీ తప్పులే
3. రెండు మాత్రమే సరిగా రాశారు. 4. అన్నీ సరిగ్గా రాశారు.
➡️ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.
➡️తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
➡️ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.
★★★★★★★★★★★★★★★★
జూలై 22 న విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ ఎలా నిర్వహించాలి? విద్యార్థుల స్థాయి నిర్ధారణ ఎలా చేయాలి ?
జూలై 22 న విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ ఎలా నిర్వహించాలి?
విద్యార్థుల స్థాయి నిర్ధారణ ఎలా చేయాలి ?
ప్రారంభ పరీక్ష - సూచనలు
* రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో 2 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలలందరికీ 2022–23 విద్యాసంవత్సరానికిగాను ప్రారంభ పరీక్షను నిర్వహించాలి. • తెలుగు, ఇంగ్లీషు, గణితంలలో ప్రారంభ పరీక్ష ఉంటుంది.
+ ఫౌండేషన్ పాఠశాలలో 2నుండి 5వ తరగతి వరకు, ఉన్నత పాఠశాలలో 6నుండి 10వ తరగతి చదువుతున్న బాలలందరికీ ప్రారంభ పరీక్ష నిర్వహించాలి. • ప్రారంభ పరీక్ష 2 రకాలుగా ఉంటుంది. మొదటిది మౌఖిక పరీక్ష రెండవది రాతపరీక్ష,
* రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నపత్రం ద్వారా తెలుగు, ఇంగ్లీషు, గణితంలలో మౌఖిక పరీక్ష నిర్వహించబడుతుంది. * ప్రతి పాఠశాలకు మౌఖిక పరీక్ష కోసం రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి. ఒక్కొక్క విద్యార్థికి వేరువేరు శాంపిల్స్ ఉపయోగించి మౌఖిక పరీక్ష జరపాలి.
• ప్రతి శాంపిల్లో ఐదు స్థాయిలు ఉంటాయి. విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి అతడు/ఆమె ఏ స్థాయిలో(ప్రారంభస్థాయి అక్షరాలస్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథస్థాయి) గుర్తించాలి. * ఒక్కొక్క విద్యార్ధిని వ్యక్తిగతంగా పిలిచి చదివించి స్థాయిని నిర్ధారణ జరపాలి. ఒక పాఠశాలలో నలుగురు టీచర్లు ఉన్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క శాంపిల్ ఉపయోగించి ఒక తరగతిలోని నలుగురు విద్యార్థులను ఒకేసారి పరిశీలించవచ్చు. పాఠశాలలో ఎక్కువమంది పిల్లలు ఉన్నట్లయితే అందుబాటులో ఉన్న టీచర్లందరినీ మూల్యాంకనంలో ఉపయోగించుకోవాలి.
* మౌఖిక, పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయి నిర్ధారణను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పరీక్షించాలి కాబట్టి మొదటి రోజు తెలుగు, రెండోరోజు ఇంగ్లీషు, మూడవరోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.
Baseline Test 2022 Model Papers 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes DOWNLOAD
2nd to 5th Class English Baseline Test 2022 Paper Download
Oral Test Maths Baseline Test 2022 Paper Download
Oral Test Telugu Baseline Test 2022 Paper Download
Oral Test English Baseline Test 2022 Paper Download
6th to 10th Class English Written Test Baseline Test 2022 Paper Download
6th to 10th Class Maths Written Test Baseline Test 2022 Paper Download
2nd to 5th Class TeluguWritten Test Baseline Test 2022 Paper Download
6th to 10th Class Telugu Written Test Baseline Test 2022 Paper Download
Baseline Line Test 2022 Instruction User Manual Download
BASELINE TEST - ORAL TEST INSTRUCTIONS
Thanks for reading BASELINE TEST INSTRUCTIONS
No comments:
Post a Comment