SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్ .. Whatsapp లో ఇక ఈ సేవలు పొందండి .. !
SBI on whatsapp: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు బ్యాంకు కస్టమర్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్‌లను వాట్సాప్ ద్వారా పొందొచ్చని ఎస్‌బీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.
రిజిస్ట్రేషన్: ఈ సర్వీసును పొందడం కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబరు నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఖాతా నంబరును టైప్ చేసి 72089 33148 నంబరుకు మెసేజ్ చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు నుంచి మాత్రమే ఈ మెసేజ్‌ను పంపించాలి. లేదంటే మీరు ఈ సర్వీసు పొందలేరు.
సేవలను పొందే విధానం: రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత సేవలను పొందేందుకు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు నుంచి +91 90226 90226కి Hi అని వాట్సాప్ మేసెజ్ చేయాలి. అక్కడ ఇచ్చే నిర్ధిష్ట సూచనలను అనుసరించి మీకు కావాల్సిన సేవను పొందొచ్చు.
వాట్సాప్ నుంచి పైన తెలిపిన నంబర్‌కు వాట్సాప్ ద్వారా ‘హాయ్’ అని మెసేజ్ పంపిన తర్వాత ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం చెబుతూ సందేశం వస్తుంది. దాని కింద మూడు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
1. ఖాతా బ్యాలెన్స్
2. మినీ స్టేట్‌మెంట్
3. వాట్సాప్ బ్యాంకింగ్ సేవల రద్దు
ఈ మూడు ఆప్షన్లలో మీ కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు మినీ స్టేట్‌మెంట్ కావాలంటే 2 టైప్ చేస్తే సరిపోతుంది. ఎస్‌బీఐ ఇప్పటికే తమ క్రెడిట్ కార్డుదారులకు వాట్సాప్ ఆధారిత సేవలను అందిస్తోంది. ఈ సేవల ద్వారా కార్డుదారులు రివార్డు పాయింట్లు, చెల్లించాల్సిన మొత్తం వంటి వివిధ సేవలను పొందవచ్చు. ఎస్‌బీఐ కార్డు వాట్సాప్ సేవల కోసం రిజిస్టర్ చేసుకునేందుకు OPTIN అని టైప్ చేసి 90040 22022కి మేసేజ్ చేయాలి. లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 080809 45040కి మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి పలు బ్యాంకులు ఇప్పటికే వాట్సాప్ ద్వారా వివిధ రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి.
Thanks for reading Good news for SBI customers .. Now get these services on Whatsapp .. !
No comments:
Post a Comment