Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 16, 2022

Google Pay Safety Tools


 గూగుల్‌ పే సేఫ్టీ టూల్స్



కొవిడ్‌ పుణ్యాన Google Pay పేమెంట్స్‌ గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. పండ్లబండి, టీస్టాల్‌ మొదలుకుని లక్షల రూపాయల వరకు ఈ మోడ్‌లో చెల్లింపులు జరుగుతున్నాయి.

అంతేకాదు ఈ వ్యవహారంలో ఏటేటా వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌కు చిరునామాగా కూడా మారింది. పనిలో పనిగా మోసాలకూ తెరలేచింది. అయితే గూగుల్‌ ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటోంది. Google Pay పేమెంట్స్‌లో యూజర్ల భద్రతకు ప్రాముఖ్యం ఇస్తోంది. ఈ సందర్భంలో ప్రధానంగా ఈ విధానంలో ఇన్‌బిల్ట్‌గా సేఫ్టీ టూల్స్‌ను తెలుసుకోవాల్సి ఉంది.

స్ర్కీన్‌పై పిన్‌ ఎంట్రీ విషయంలో రిమోట్‌ నుంచి డెస్క్‌టాప్‌ అటాక్స్‌ నుంచి భద్రత కల్పిస్తోంది. డిజిటల్‌ పేమెంట్స్‌లో ఇతరత్రా కుంభకోణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ Google Pay విషయంలో ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. దీనికి సంబంధించి ముందునుంచీ Google  తగు భదత్ర చర్యలు చేపట్టింది.

ఆన్‌బోర్డింగ్‌ దశలో రిస్క్‌కు సంబంధించి చెక్‌ను ఉంచింది. బ్యాడ్‌ యాక్టర్స్‌ను దూరంగా ఉంచుతోంది. ఆ శక్తులు యాప్‌లోకి వారు చొరబడకుండా చూస్తోంది.

మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత స్కామ్‌ ప్రివెన్షన్‌ మోడల్స్‌ను అనుసరిస్తోంది. అనుమానితులు లేదంటే కాంటాక్ట్‌లో లేని వ్యక్తుల జొరబాటు విషయంలో ఎప్పటికప్పుడు వినియోగదారులను అలెర్ట్‌ చేస్తోంది.

లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ప్రతి రోజూ ఎంతోమంది వచ్చి చేరుతుంటారు. ఆ కారణంగా కొత్త యూజర్లను కూడా దృష్టిలో పెట్టుకుని హెచ్చరికలను చాలా స్పష్టంగా తెలియజేయడాన్ని పద్ధతిగా పెట్టుకుంది. ఈ హెచ్చరిక పేమెంట్‌ ప్రతి దశలోనూ ఉంటోంది.

Google యాప్‌ నోటిఫికేషన్స్‌ అలాగే ఎస్‌ఎంఎస్‌లతో యూజర్‌ను అప్రమత్తం చేస్తూ ఉంటుంది. రిక్వెస్ట్‌కు అప్రూవల్‌, తదుపరి యూజర్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి అమౌంట్‌ బదిలీ తదితరాలు జరిగేలా చూస్తోంది. తద్వారా మోసాలను అరికట్టే యత్నాలను పకడ్బందీగా చేస్తోంది.

Thanks for reading Google Pay Safety Tools

No comments:

Post a Comment