Sleeping Tips : రాత్రిపూట పదే పదే మేల్కొంటున్నారా ? అయితే , ఈ చిట్కాలను పాటించి గాఢ నిద్రను పొందండి ..
Sleeping Tips: ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో సమయపాలన లేని జీవనశైలి కారణంగా.. నిద్ర కూడా పట్టని పరిస్థితి నెలకొంది.
ఈ నిద్రలేమి సమస్య ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు, మంచి నిద్ర కోసం ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ముఖ్యం..
కంటినిండా నిద్రపోతే.. ఆ రోజుంతా ఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటారు. శక్తి సామర్థ్యాలూ పెరుగుతాయి. నిద్ర మన రోజు అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రపోతున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అందుకే.. మరుసటి రోజు చాలా రిఫ్రెష్ అవుతారు. అందుకే రాత్రివేళ కంటినండా నిద్రపోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
అనేక అధ్యయనాల ప్రకారం.. నిద్రించే సమయం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. నవజాత శిశువులు ప్రతిరోజూ 14 - 15 గంటలు నిద్రపోవాలి. పిల్లలకు 12 నుంచి 14 గంటల నిద్ర అవసరం. టీనేజర్లకు 10 - 12 గంటలు, పెద్దలకు 8- 10 గంటలు, 50 , 60 ఏళ్ల వారు 7- 8 గంటలు, 60 ఏళ్లు పైబడిన వారికి 6 - 7 గంటల నిద్ర అవసరం.
జీవనశైలిలో మార్పు..
మంచి నిద్ర కావాలంటే.. మంచి జీవనశైలి కూడా తప్పనిసరి. సమయానికి ఆహారం తినాలి. సమయానికి పడుకోవాలి. నిద్రపోవడానికి 2 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన డ్రింక్స్ మాత్రే తాగాలి. మంచి పుస్తకాలు చదవాలి. టైమ్ కు నిద్రపోవాలి. ఫోన్‌ను సాధ్యమైనం దూరం పెట్టాలి. నిద్ర లేమితో బాధపడుతున్నా? ప్రశాంతత లేకపోయినా? బెడ్‌రూమ్ నుండి ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌లు, మొబైల్ ఫోన్‌లు వంటి వాటిని తీసేయాలి.
Thanks for reading Sleeping Tips: Waking up repeatedly at night? But, follow these tips and get deep sleep..
No comments:
Post a Comment