Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 17, 2022

The new GST rates will come into effect across the country from Monday


 రేపటి నుంచే జీఎస్టీ బాదుడు .. ధరలు పెరిగే వస్తువుల జాబితా ఇదే . !

GST Rates: ఒకవైపు తగ్గిన ఆదాయం, మరోవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు.. ప్రతీరోజూ తినే బియ్యం నుంచి కూరగాయల ధరల వరకు ఆకాశాన్ని తాకుతున్నాయి.

దీంతో సామాన్య ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరింత భారాన్ని మోపుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చెంచాలు, షార్ప్‌నర్స్ నుంచి హోటల్ రూమ్స్, సోలార్ వాటర్ హీటర్లు, యంత్రాలు, లెదర్ వస్తువులు ఇలా పలు రకాల వస్తువులు నేటి నుంచి భారం కానున్నాయి.

గత నెల చండీగఢ్ లో జరిగిన జీఎస్టీ కమిటీ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకు పన్ను మినహాయింపు ఉన్న అనేక వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు కొన్ని వస్తువులపై జీఎస్టీ మరింత పెంచేందుకూ ఈ సమావేశం ఆమోదం తెలిపింది. సవరించిన కొత్త జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకిరానున్నాయి. దీంతో కొన్ని వస్తు, సేవలు మరింత భారం కానున్నాయి.

12శాతం పన్ను పరిధిలో ఉండే వస్తు, సేవలు..

– సోలార్ వాటర్ హీటర్లు, యంత్రాలు

– అన్ని రకాల తోలు(లెదర్) వస్తువులు

– అన్ని రకాల ప్రింటెడ్ మ్యాపులు, చార్టులు

– రోజువారీ అద్దె రూ. 1,000 వరకు ఉండే హోటల్ రూమ్ లు

– ప్రభుత్వ స్థలాల్లో మట్టిపని, సబ్ కాంట్రాక్టులకు సంబంధించిన వర్క్ కాంట్రాక్టులు

18శాతం పన్ను పరిధిలోని వస్తువులు ..

– ఎల్ఈడీ బల్బులు, సిరా, చాకులు, బ్లేడ్లు, పెన్సిల్స్ షార్ప్‌నర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, గరిటెలు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్లు.

– ప్రిటింగ్, రైలింగ్, డ్రాయింట్ కోసం ఉపయోగించే ఇంక్, ఫిక్సర్, మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు.

– విద్యుత్, సైకిళ్లతో నడిచే పంపులు, పాడి పరిశ్రమకోసం ఉపయోగించే యంత్ర పరికరాలు

– విత్తనాలు, ఆహార ధాన్యాలు, పప్పుల క్లీనింగ్, విత్తనాల గ్రేడింగ్ యంత్రాలు

– చిరు ధాన్యాల మిల్లింగ్ కోసం ఉపయోగించే యంత్ర పరికరాలు

– వెట్ గ్రైండర్లు, ఎయిర్ బేస్ట్ ఆటా చక్కీ, చెక్ బుక్ లు,

– రోడ్లు, వంతెనలు, రైల్వే, మెట్రో, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, స్మశానాల నిర్మాణ పనుల వర్క్ కాంట్రాక్టులు.

– కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నిర్వహణలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాలు, కాలువలు, ఆనకట్టలు, పైప్ లైన్లు, నీటి సరఫరా ప్లాంట్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులకు సంబంధించిన వర్క్ కాంట్రాక్టులు.

5శాతం జీఎస్టీ పరిధిలో..

– ఐసీయూ మినహా రోజువారీ అద్దె రూ. 5వేలుపైన ఉండే ఇన్ ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వర్తించని హాస్పిటల్ రూమ్ లు.

– ఫ్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్డ్ బియ్యం, గోధుమ పిండి, బటర్ మిల్క్, పెరుగు, లస్సీ, పన్నీర్

Thanks for reading The new GST rates will come into effect across the country from Monday

No comments:

Post a Comment