Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, August 19, 2022

5G Phones: Does your smartphone support 5G network?


 5G Phones: మీ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!

దేశంలో 5జీ విప్లవం మొదలైంది. టెలికం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతో పాటు ఇతర సంస్థలు వినియోగదారులకు 5జీ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముందుగా జియో,ఎయిర్‌టెల్‌లు మరికొద్ది రోజుల్లో ఈ ఫాస్టెస్ట్‌ నెట్‌ వర్క్‌ను అందిస్తున్నట్లు తెలిపాయి. 

ఈ నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు..తాము వినియోగిస్తున్న ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కి సపోర్ట్‌ చేస్తుందా? లేదా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్‌ వర్క్‌కు ఫోన్‌లు సపోర్ట్‌ చేస‍్తాయో? లేదో? తెలుసుకుందాం. 

మీ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుందో లేదో ఇలా చెక్‌ చేయండి 

స్టెప్‌1: మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లండి

స్టెప్‌2: 'వైఫై & నెట్‌వర్క్‌' ఆప్షన్‌పై ట్యాప్‌ చేయండి 

స్టెప్‌3: ఇప్పుడు 'సిమ్ & నెట్‌వర్క్' ఆప్షన్‌పై క్లిక్‌  చేయండి

స్టెప్‌4: సిమ్‌& నెట్‌ వర్క్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేసినప్పుడు మీ ఫోన్‌ ఏ నెట్‌ వర్క్‌కి సపోర్ట్‌ చేస్తుందో అక్కడ డిస్‌ప్లే అవుతుంది. 

స్టెప్‌5: మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తే.. ఇదిగో ఇలా 2జీ/3జీ/4జీ/5జీఇలా చూపిస్తుంది. 

సపోర్ట్‌ చేయకపోతే 

సపోర్ట్‌ చేస్తే మంచిదే. ఒకవేళ సపోర్ట్‌ చేయకపోతే ఏం చేయాలనే ప్రశ్నకు సమాధానంగా 5జీ నెట్‌ వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  రియల్‌మీ, షావోమీతో పాటు ఇతర స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు 5జీ నెట్‌ వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫోన్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం..రానున్న రోజుల్లో 5జీకి సపోర్ట్‌ చేసే  రూ.10వేల లోపు ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయని చిప్‌, సాఫ్ట్‌ వేర్‌ తయారీ సంస్థ క్వాల్కమ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

Thanks for reading 5G Phones: Does your smartphone support 5G network?

No comments:

Post a Comment