Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 17, 2022

Alert: Bad news for ATM card users!


 అలర్ట్: ఏటీఎం కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్!

ఏటీఎం కార్డ్‌ వినియోగదారులకు బ్యాంకులు భారీ షాకిచ్చాయి. ఏటీఎం విత్‌ డ్రా పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఆగస్ట్‌ 1 నుంచి ఏటీఎం సెంటర్లలో బ్యాంకులు విధించిన 5 ఫ్రీ ట్రాన్సాక్షన్‌ల కంటే ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ తరుణంలో ఏటీఎంలలో పరిమితికి మించిన ప్రతీ విత్‌ డ్రాల్‌పై 17 రూపాయలు, నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌లపై 6 రూపాయలు అదనంగా బ్యాంకులు వసూలు చేయనున్నాయి. 

ఏటీఎం ఇన్‌స్టాలేషన్‌, మెయింటెన్స్‌ ఛార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతినెల ఏటీఎం సెంటర‍్ల నుంచి 5 సార్ల లోపు డబ్బుల్ని డ్రా చేస్తే..అందుకు అదనపు చెల్లింపులు చెల్లించే అవకాశం లేదు. అయితే తాజాగా ఆ ఐదు సార్లు దాటితే అదనపు రుసుము వసూలు చేసుకోవచ్చని ఆర్బీఐ.. బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో కస్టమర్ల నుంచి ఏటీఎం లావాదేవీలపై రుసుమును వసూలు చేసేందుకు సిద్ధ మయ్యాయి.   

గతేడాది జూన్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గతేడాది జూన్‌లో నెలవారీ అదనపు ట్రాన్సాక్షన్‌లపై రూ.21 వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు చెప్పింది. దీంతో ఈ ఏడాది జనవరి 1నుంచి ఏటీఎంలో అదనపు విత్‌ డ్రాపై రూ.21వసూలు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆర్బీఐ ఏటీఎంలో మనీ విత్‌ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల నుంచి బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. బ్యాంకులు సైతం ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఆగస్ట్‌ 1 నుంచి ఏటీఎం మనీ విత్‌ డ్రాపై అదనపు రుసుములు వసూలు చేయడం ప్రారంభించాయి.

ఎన్ని ట్రాన్సాక్షన్‌లకు ఉచితం 

ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వినియోగదారులు ప్రతి నెలా వారి (ఉదాహరణకు ఏ బ్యాంక్‌ ఏంటీఎం ఉంటే ఆ బ్యాంక్‌) ఏటీఎంలో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్‌లు, ఏటీఎం ఎస్‌బీఐ బ్యాంక్‌ది అయి ఉండి మీరు బ్యాంక్‌ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్‌లకు అనుమతి ఇస్తున్నాయి. ఇక నాన్ మెట్రో కేంద్రాల్లోని కస్టమర్లు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.

Thanks for reading Alert: Bad news for ATM card users!

No comments:

Post a Comment