Beauty Sleep : ఎక్కువ నిద్రపోతే అందంగా అవుతారా .. ? ఇందులో నిజమెంతో తెలుసుకోండి .. !
ఆరోగ్యానికి తగినంత నిద్ర (sleep) చాలా ముఖ్యం. అయితే చర్మ సంరక్షణకు, సౌందర్యానికి సంబంధించిన అంశాల్లో నిద్రను ప్రధానంగా భావించరు. కానీ ఎలా కనిపిస్తున్నారనే అంశంపై నిద్ర గణనీయమైన ప్రభావం చూపుతుంది.
అంటే నిద్ర అందం (Beauty)పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడే బ్యూటీ స్లీప్ అనేది తెరపైకి వస్తోంది. ఒక వ్యక్తి యవ్వనంగా, అందంగా కనిపించడానికి వారికి అవసరమైన నిద్రను బ్యూటీ స్లీప్ (Beauty Sleep)గా వ్యవహరిస్తారు. బ్యూటీ స్లీప్ అనే పదబంధాన్ని చాలా మంది ఇంతకు ముందు వినకపోవచ్చు. అయితే ఆరోగ్యంతో పాటు అందం కూడా బ్యూటీ స్లీప్‌తో ముడిపడి ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
చర్మ పునరుత్పత్తికి నిద్ర చాలా అవసరం. నిద్రిస్తున్నప్పుడు, శరీరం రికవరీ మోడ్‌లోకి వెళుతుంది. కార్టిసాల్, మెలటోనిన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ సహా నిద్ర వివిధ దశలలో అనేక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు చర్మానికి చాలా అవసరం. ఎందుకంటే అవి రోజువారీ చర్మ నష్టాన్ని సరిచేస్తాయి. కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి యవ్వన చర్మాన్ని కాపాడతాయి.
నిద్ర లేకపోవడం వల్ల బయటకు కనిపించడం కంటే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోతే శరీరం, మనస్సు సక్రమంగా పని చేయవు. నీరసంగా, అలసిపోయినట్లు అనిపించవచ్చు. రోజంతా గడపడానికి తక్కువ శక్తి ఉంటుంది. ఎలివేటెడ్ కార్టిసాల్ స్థాయిల కారణంగా, ఇతర అధ్యయనాలు నిద్ర లేమి గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నాయి. నిద్ర లేమితో జ్ఞాపకశక్తి కోల్పోవడం, భావోద్వేగ అస్థిరత, పేలవమైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఎదురవుతాయి. నిద్ర లేకపోవడం వల్ల పనిలో సామర్థ్యం దెబ్బతింటుంది. మానసిక స్థితి మార్పులకు కారణమవుతుంది. నిరాశ, కోపం వంటి ప్రతికూల భావాలను పెంచుతుంది.
* తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మెరుగైన చర్మం కోసం ఈ స్లీపింగ్ టిప్ప్ పాటించండి..
- ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే సాయంత్రం, రాత్రి కెఫీన్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
- పడుకునే ముందు మద్యం తాగవద్దు. ఆల్కహాల్ నిద్రను నాశనం చేస్తుంది. ఇది పగటిపూట అలసిపోయేలా, నిద్రపోయేలా చేస్తుంది.
- రాత్రికి ముందు ఏదైనా తీవ్రమైన వ్యాయామం చేయడం మానుకోండి.
- పడుకోవడానికి ఒక గంట ముందు, గాడ్జెట్‌లను దూరంగా ఉంచండి.
- బాగా నిద్రపోవడానికి సహాయపడే హాబీని అలవాటు చేసుకోండి.
* సాలిడ్ రొటీన్‌ని క్రియేట్ చేయడానికి, ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అవ్వండి..
- రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.
- ప్రతిరోజూ ఉదయం దాదాపు ఒకే సమయానికి నిద్ర లేవండి.
- పగటిపూట న్యాప్స్‌ను 30 నిమిషాలకు మించకుండా ఉంచండి.
- వీకెండ్స్‌లో కూడా రెగ్యులర్ స్లీపింగ్ రొటీన్ ఫాలో అవ్వండి.
Thanks for reading Beauty Sleep: Will you be beautiful if you sleep more? Know the truth in this .. !
No comments:
Post a Comment