Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 4, 2022

English Subject: Is it difficult to read and write English? Follow these tips suggested by experts


 English Subject : ఇంగ్లీష్ చదవడం , రాయడం కష్టంగా ఉందా .. నిపుణులు సూచిస్తున్న ఈ టిప్స్ పాటించండి.

ఇండియాలో మాతృభాషకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే చాలామందికి ఇంగ్లీష్‌ (English Language) నేచురల్‌గా రాదు. కాబట్టి ఇంగ్లీష్‌ ల్యాంగ్వేజ్‌ను పాఠశాలల్లో ఓ సబ్జెక్ట్‌గా బోధిస్తున్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌కు డిమాండ్‌ పెరిగింది. దాదాపు అన్ని రకాల పోటీ పరీక్షలు,(Competitive Exams),ప్రవేశ పరీక్షల్లో ఇంగ్లీష్‌కు చోటు కల్పిస్తున్నారు. ఇంగ్లీష్‌ స్కిల్స్‌ ఆధారంగా కూడా ఉద్యోగ అవకాశాలు(Job opportunities) లభిస్తున్నాయి. కోవిడ్‌ కాలంలో లాక్‌డౌన్‌ విధించడంతో పాఠశాలలు చాలా కాలం మూతబడ్డాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు పరిమితమయ్యారు. కొంత కాలంగా విద్యార్థులు తిరిగి స్కూల్స్‌కు వస్తున్నారు. ఈ సమయంలో పిల్లలకు ఇంగ్లీష్‌ మాట్లాడటం, రాయడం, చదవడంపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

* ఇంగ్లీష్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవడానికి.. ఇంగ్లీష్‌ స్కిల్స్‌పై చాలా సంవత్సరాలు రీసెర్చ్‌ చేసిన బర్లింగ్టన్ సూచనలు ఇవే..

* గ్రామర్‌ రూల్స్‌ ప్రాక్టీస్‌ చేయాలి

గ్రామర్‌ రూల్స్‌ను చదవడం మాత్రమే కాదు, వర్క్‌బుక్‌లు లేదా కొత్త-ఏజ్ వెబ్‌బుక్‌లలో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా స్థానిక పాఠ్యప్రణాళిక ప్రమాణాలకు అనుగుణంగా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ పరంగా రూపొందించిన క్వాలిటీ ప్రాక్టీస్‌ బుక్స్‌ను ఎంచుకోవాలి.

* ఇంగ్లీష్‌ చదవాలి, వినాలి

గ్రామర్‌ రూల్స్‌, రైటింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా చదవాలి. గట్టిగా ఇంగ్లీష్‌ను బయటకు చదవడం ద్వారా.. ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంది. కాగ్నిటివ్‌ ఎబిలిటీస్‌ను కూడా పెంచుకోవడానికి ఎక్సర్‌సైజ్‌లా ఉపయోగపడుతుంది. వొకాబులరీ పెంపొందించడానికి, ఇంగ్లీష్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌లు, పాడ్‌క్యాస్ట్‌లు, ఆడియో స్పీచెస్‌ను తప్పకుండా వినాలి.

* షార్టకట్స్‌ వద్దు

ఇతరులు రాసిన టాపిక్స్ కాపీ చేయడం మానుకోవాలి. సాధారణంగా ఉన్నా, ఇంప్రెస్‌ చేయకపోయినా సొంత మాటల్లోనే రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. ఈ రోజుల్లో ఎక్కువగా ఇంటర్నెట్ నుంచి కంటెంట్‌ను తీసుకుని ఎక్సర్‌సైజ్‌లను పూర్తి చేస్తున్నారు. ఇది తప్పు. ఇంగ్లీష్‌లో రైటింగ్‌ స్కిల్స్‌ మెరుగుపడకుండా అడ్డంకిగా మారుతుంది. క్రియేటివ్‌ రైటింగ్‌ పాత పద్ధతిగా అనిపించినా.. దీని ద్వారా రైటింగ్‌, కమ్యునికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ధి చెందుతాయి.

* క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా రాయాలి

రాసే ప్రతి అంశాన్ని అతిగా వివరించకూడదు. రీడర్స్‌కు ఇబ్బందిగా అనిపించకుండా ఉండాలంటే, ఆసక్తిగా చదవాలంటే.. స్పష్టంగా, సూటిగా వాక్యాలను రాయడం అలవాటు చేసుకోవాలి. సరళమైన పదాలతో అంశాలను వివరిస్తే విషయం రీడర్స్‌కు సులువుగా అర్థమవుతుంది.

* ఎడిటింగ్‌, ప్రూఫ్ రీడింగ్

ఎడిటింగ్‌, ప్రూఫ్‌ రీడింగ్‌ అనేవి రైటింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడంలో ప్రాథమిక దశలు. ప్రూఫ్‌ రీడింగ్‌ ద్వారా.. చేసిన మిస్టేక్స్‌, మిస్‌ అయిన సమాచారం, అదనపు పదాలు గుర్తించవచ్చు. వాటిని గుర్తించి, భవిష్యత్తులో చేయకుండా ఉండటం ద్వారా రైటింగ్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. రాసిన అంశాలను చెక్‌ చేయమని, సన్నిహితులు, స్నేహితులను అడగవచ్చు, వారి సూచనల ద్వారా మిస్టేక్స్‌ను గుర్తించవచ్చు.

Thanks for reading English Subject: Is it difficult to read and write English? Follow these tips suggested by experts

No comments:

Post a Comment