Health Tips : కూర్చొని నిద్ర పోతున్నారా .. చాలా ప్రమాదం మానేయ్యండి .. !
నిద్ర వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే నిద్రలో శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. అలసట నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
అయితే నిద్రించే విధానం అందరికీ భిన్నంగా ఉంటుంది. కొంతమంది పడుకొని నిద్రపోతే మరికొందరు కూర్చొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే కూర్చొని నిద్ర పోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఈ పద్దతి అనేది మరణానికి కూడా కారణం అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
1. వెన్నునొప్పి
మీకు కూర్చొని నిద్రపోయే అలవాటు ఉంటే వెన్నునొప్పి సమస్య వస్తుంది. దీనివల్ల వెన్నెముక ఆకారం దెబ్బతింటుంది. దీని కారణంగా వెన్నునొప్పి సమస్యలు ఏర్పడుతాయి. అలాగే ఇది వెనుక భాగంలో వాపును కలిగిస్తుంది.
2. రక్తప్రసరణ తగ్గడం
ఒకే భంగిమలో ఎక్కువ సేపు పడుకోవడం వల్ల రక్తనాళాలలో సమస్యలు ఏర్పడుతాయి. దీంతోపాటు జలదరింపు సమస్య వస్తుంది. కాళ్లలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
3.కీళ్లలో సమస్యలు
కూర్చొని నిద్రపోవడం వల్ల కీళ్లలో సమస్య ఏర్పడుతాయి. అంతే కాదు కాళ్ల సిరల్లో స్ట్రెయిన్ ఏర్పడుతుంది. దీంతో పాటు ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలో రకరకాల నొప్పులు వస్తాయి. శరీరం బిగుసుకుపోతుంది.
ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మరణమా?
కూర్చొని నిద్రపోవడం వల్ల పెద్దగా హాని జరుగుతుందనే ఆధారాలు లేకపోయినా ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కాళ్లలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దీనిపై సరైన శ్రద్ధ చూపకపోతే పాదాల్లో వాపు సమస్య, నొప్పి వంటి సమస్యలు ఏర్పడుతాయి. చాలా కాలంగా ఇలా కొనసాగితే వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది.
Thanks for reading Health Tips: Are you sleeping while sitting?
No comments:
Post a Comment