దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్ పీవో-2022) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టుల వివరాలు..
ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 6432 పోస్టులు
బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు :
కెనరా బ్యాంక్: 2500
యూకో బ్యాంక్: 550
బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535
పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500
పంజాబ్ సింధ్ బ్యాంక్: 253
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094
వాస్తవానికి మరో ఐదు ప్రభుత్వ బ్యాంకులు (బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్) కూడా ఐబీపీఎస్ ద్వారానే నియామకాలు చేపడుతుంటాయి. 2023-24 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో 6 బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి మాత్రమే ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 01.08.2022 నాటికి 20 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1992 - 01.08.2002 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి
ఎంపిక విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంటర్వ్యూ ద్వారా.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం : 02.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది : 22.08.2022
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : సెప్టెంబర్/అక్టోబరు 2022.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ : సెప్టెంబర్/అక్టోబరు 2022.
ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : అక్టోబర్ 2022.
ప్రిలిమినరీ పరీక్ష : అక్టోబరు 2022.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు : డిసెంబరు 2022.
ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : జనవరి/ఫిబ్రవరి 2023.
ఇంటర్వ్యూ : జనవరి/ఫిబ్రవరి 2023
నియామకం : ఏప్రిల్ 2023.
Thanks for reading Institute of Banking Personnel Selection (IBPS PO-2022) has released notification for filling up the posts of Probationary Officer (PO)/Management Trainee (MT) in various public sector banks.
No comments:
Post a Comment