అమ్మవారిని సులువుగా అలంకరించేద్దాం! ! తక్కువ వ్యవధిలో చేసుకునేందుకు ఇలా ప్రయత్నించండి ..
వరలక్ష్మీ పూజకు అమ్మ వారితోపాటు మందిరాన్నీ చక్కగా అలంకరించుకుంటాం. అయితే ఎక్కువ సమయం దీనికే కేటాయించాల్సి వస్తుంది. ఈసారి సులువుగా, తక్కువ వ్యవధిలో చేసుకునేలా వీటిని ప్రయత్నించండి.
* చతురస్రాకార అట్టముక్కను తీసుకోండి. పెద్ద తమలపాకులు ఎంచుకొని పెట్టుకోవాలి. వీటిని చిత్రంలోలా ఒకదాని మీద ఒకటి టూ వే స్టిక్కర్‌తో అట్టంతా అతికించాలి. తర్వాత ఒక్కో ఆకు మీదా రంగురంగుల పూలను కుడితే సరి. అటూ ఇటూ పూ మాలలను వేలాడదీయాలి. అమ్మ వారి పీటకు వెనకాల ఇది బ్యాక్‌డ్రాప్‌గా బాగుంటుంది.
* పిల్లల చార్టులు రెండు రంగులవి ఎంచుకోండి. లేత రంగును గోడకు అతికించాలి. ముదురు రంగు దాన్ని మొదటి దానికి మధ్యలో వచ్చేలా కత్తిరించి అతికించాలి. దానిపై మెలికల ముగ్గు వేసి, చుట్టూ పూలను అతికిస్తే సంప్రదాయ కళ వచ్చేస్తుంది.
* ఎంబ్రాయిడరీకి ఉపయోగించే హూప్‌ని తీసుకోండి. లేకపోతే ఓ అట్టముక్కను గుండ్రంగా కత్తిరించడమో, వైరును వృత్తాకారం వచ్చేలా మెలేయడమో చేయాలి. నచ్చిన రెండు రంగుల పూల మాలల్ని తీసుకుని ఆ వృత్తాన్ని కప్పుతూ చుట్టేయాలి. గులాబీలను వృత్తం లోపలగా కిందకి వేలాడేస్తే సరిపోతుంది. పీటకి వెనుక గోడకి టేపుతో అతికించడమో, గోడకు ఆనేలా ఉంచినా సరి. సమయముంటే పీటకి ముందూ పూలతో అలంకరిస్తే అలంకరణ ఆకట్టుకుంటుంది.
Thanks for reading Let's decorate Varalakshmi Devi easily! Try this to do it in less time..
No comments:
Post a Comment