Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 4, 2022

Raksha Bandhan 2022 : When to tie rakhi to brother .. So what day is Rakshabandhan ..


 Raksha Bandhan 2022 : అన్నకి రాఖీ ఎప్పుడు కట్టాలి .. ఇంతకీ రక్షాబంధన్ ఏ రోజు ..

Raksha Bandhan 2022: అన్నకి రాఖీ కట్టాలంటే చెల్లికి ఎంత సంతోషమో. అది నాన్న ఇచ్చిన గిప్టే కావచ్చు.. కానీ అన్న ఆనందంతోనో లేదా ఒకింత లోలోపల ఉడుకుమోత్తనంతోనో ఇచ్చే బహుమతి అంటే చెల్లికి ఎంతో సరదా..

తమ్ముడు తనకంటే చిన్నవాడైనా అమ్మ వాడిచేతికి రాఖీ కట్టమని చెబుతుంది.. వాడు కూడా ఏదో ఒకటి ఇస్తే ఎంత ఆనందమో.. ఇలా అన్నా చెల్లెళ్ల మద్య, అక్కా తమ్ముళ్ల మధ్య వెల్లి విరిసే ఆనందంతో ప్రతి ఇల్లూ కళకళలాడుతుంది. అయితే ఈ ఏడాది ఒకింత కన్ఫ్యూజ్. రాఖీ పండుగ ఆగస్టు 11వ తేదీ జరుపుకోవాలా లేక 12వ తేదీనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి రక్షాబంధన్ తేదీల గురించి గందరగోళం ఏర్పడింది. శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ ఉదయం 7:06 గంటలకు ముగియనుంది. ఇదే సమయంలో పూర్ణిమతో పాటు భద్ర తిధి కూడా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాఖీ పండుగను భద్ర కాలంలో జరుపుకోవచ్చు. అంటే ఆగస్టు 11వ తేదీ సాయింత్రం 5:18 గంటల నుంచి 6:20 గంటల మధ్యలో రాఖీ కట్టవచ్చు. పౌర్ణమి తిథి ఆగస్టు 12వ తేదీన సూర్యోదయానికి ముందు వస్తుంది. కాబట్టి ఈ రోజంతా పౌర్ణమి తిథిగా పరిగణించబడుతుంది.

పురాణాలలో భద్ర గురించి కొన్ని వివరాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం సూర్య దేవుని కుమార్తెను భద్రగా పరిగణిస్తారు. అంటే శని దేవునికి సోదరి. శని స్వరూపం కఠినంగా ఉంటుందని, అలాగే భద్ర కూడా స్వభావరీత్యా కూడా కాస్త కఠినంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మా తన పంచాంగంలో విష్టి కరణం స్థానం కల్పించాడు. వాస్తవానికి భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. అందరి పనులు అడ్డకోవడం ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి, ఏదో కరణ విష్టిగా కరణాలలో చోటు కల్పించాడు. భద్ర మూడు లోకాలలో ఉంటారని చెబుతారు. తను నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అస్సలు జరగవు. అందుకే భద్ర కాలంలో శుభకార్యాలు వాయిదా వేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం నిరాశాజనకంగానే వస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈసారి రక్షాబంధన్ పండుగ భద్ర కాలంలో వచ్చింది. భద్ర భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పండుగ జరుపుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఆగస్టు 11వ తేదీ సాయింత్రం 5:18 గంటల నుంచి 6:20 గంటల వరకు సోదర సోదరీమణులు రాఖీ పండుగను జరుపుకోవచ్చు అని పండితులు సెలవిస్తున్నారు.

Thanks for reading Raksha Bandhan 2022 : When to tie rakhi to brother .. So what day is Rakshabandhan ..

No comments:

Post a Comment