Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 3, 2022

Water: Are you drinking water while eating food ? But know these .. !


 Water : అన్నం తినే సమయంలో నీళ్లు తాగుతున్నారా ? అయితే ఇవి తెలుసుకోండి .. !

Water : భోజనం చేసే సమయంలో సహజంగానే చాలా మంది నీళ్లను తాగుతుంటారు. కొందరు గొంతులో ఆహారం అడ్డు పడిందని చెప్పి నీళ్లను తాగితే.. కొందరు కారంగా ఉందనో..

మరే ఇతర కారణమో చెప్పి.. నీళ్లను తాగుతారు. అయితే కొందరు మాత్రం భోజనం చేసినంత సేపు నీళ్లను అదే పనిగా తాగుతూనే ఉంటారు. కానీ వాస్తవానికి భోజనం చేసే సమయంలో నీళ్లను అసలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. దాని వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నం తినే సమయంలో నీళ్లను తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో గ్యాస్‌ సమస్య వస్తుంది. అలాగే అజీర్తి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే జీర్ణం కాని ఆహారం కొవ్వుగా మారుతుంది. అది శరీరంలో చేరి నిల్వ ఉంటుంది. ఇలా తరచూ జరగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. దీంతో డయాబెటిస్‌ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

ఇక భోజనం మధ్యలో నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయంలోని ఎంజైమ్‌ల పనితీరు మందగిస్తుంది. దీంతో మనం ఇకపై ఎప్పుడు ఆహారం తిన్నా అది సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా మనకు శక్తి కూడా లభించదు.

ఇక అన్నం తినే సమయంలో నీళ్లను తాగితే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. ఇలా అనేక సమస్యలు వస్తాయి. కనుక అన్నం తినే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు. భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు లేదా చేశాక 30 నిమిషాలు ఆగి మాత్రమే నీళ్లను తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. కనుక అందరూ ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు

Thanks for reading Water: Are you drinking water while eating food ? But know these .. !

No comments:

Post a Comment