Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 15, 2022

WhatsApp: Camera access on WhatsApp with a single swipe!


 WhatsApp: ఒక్క స్వైప్‌తో వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్!

 ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్‌ కోసం ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. చాలామందికి వాట్సాప్‌లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి పూర్తి అవగాహన ఉండదు. వాట్సాప్‌ కొత్తగా తీసుకొచ్చే ఫీచర్లలో కొన్నింటికి ప్రచారం చేస్తే, మరికొన్నింటిని సైలెంట్‌గా పరిచయం చేస్తుంది. తాజాగా వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను చడీచప్పుడు లేకుండా తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫీచర్‌ అనేగా మీ సందేహం?అదేనండీ.. చాట్‌ పేజీలో కెమెరా ఆప్షన్‌. ఇప్పటివరకు వాట్సాప్‌ ఓపెన్ చేయగానే స్క్రీన్‌ మీద చాట్స్‌, స్టేటస్‌, కాల్స్‌ అనే మూడు సెక్షన్లు మాత్రమే కనిపించేవి. తాజా అప్‌డేట్‌లో చాట్స్‌కు ఎడమవైపు కెమెరా ఐకాన్‌ యాడ్‌ అయింది. చాట్ పేజ్‌ని కుడివైపు స్వైప్‌ చేయడం లేదా కెమెరా ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లో కెమెరా ఆప్షన్‌ వస్తుంది. దీంతో మీకు కావాల్సిన ఫొటోను క్లిక్‌మనిపించి స్టేటస్‌గా వాడుకోవచ్చు, ఇతరులతో షేర్‌ చేయొచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్‌ చేయాలంటే ఏదైనా కాంటాక్ట్ ఓపెన్‌ చేయడం లేదా స్టేటస్‌ పేజ్‌లోకి వెళ్లి కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాల్సిందే. తాజా అప్‌డేట్‌తో కెమెరాను సులువుగా యాక్సెస్‌ చేయొచ్చు. గతంలో ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. 

కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ కొత్తగా మూడు ప్రైవసీ అప్‌డేట్‌లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి ఫీచర్‌తో వాట్సాప్‌ గ్రూప్‌లోంచి ఇతర సభ్యులకు తెలియకుండా వెళ్లిపోవచ్చు. కేవలం అడ్మిన్లకు మాత్రమే గ్రూప్‌ నుంచి వెళ్లిపోయిన వారి వివరాలు కనిపిస్తాయి. రెండో ఫీచర్‌లో యూజర్లు ఆన్‌లైన్‌లో ఒకరితో ఛాట్‌ చేస్తున్నప్పుడు, మరొకరికి తమ ఆన్‌లైన్‌ స్టేటస్‌ కనపడకుండా లైవ్‌ స్టేటస్‌ ఎవరెవరు చూడొచ్చనేది యూజర్‌ నిర్ణయించుకోవచ్చు. ఇక మూడో ఫీచర్‌తో వ్యూవన్స్‌లో స్క్రీన్‌షాట్‌ తీసుకోవడం సాధ్యంకాదు. వాట్సాప్‌లో ఏదైనా మీడియాఫైల్‌ను షేర్‌ చేసినప్పుడు ఒకసారే చూసే విధంగా వ్యూవన్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా పంపిన ఫొటోలను చాలామంది  స్క్రీన్‌షాట్‌ తీస్తుండటంతో వ్యూవన్స్‌ ఉపయోగంలేకుండా పోతోందట. ఇకపై వ్యూవన్స్‌ ద్వారా పంపే ఫొటోలను స్క్రీన్‌షాట్‌ తీసుకునే వీల్లేకుండా అప్‌డేట్ చేసినట్లు వాట్సాప్‌ తెలిపింది.

Thanks for reading WhatsApp: Camera access on WhatsApp with a single swipe!

No comments:

Post a Comment