అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే జేబుకి చిల్లే
దసరా పండుగ వచ్చేస్తోంది. ఇంకేముంది ఫెస్టివల్ సీజన్ వచ్చినట్లే. ఇప్పటికే దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థలు.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ డే అని, మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ని నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమవుతున్నా ఈ ఆఫర్ సేల్‌లో మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్‌లు ఉంటాయి. ఇంత వరకు అంతా బాగానే ఉంది గానీ ఇక్కడే మనం ఓ విషయాన్ని గుర్తించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు
►కంపెనీ ఇస్తున్న డీల్స్‌లను చెక్ చేయండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న డీల్‌ల వైపు ఆకర్షితులయ్యే ముందు, అవి ఎంత నిజమైనవో చెక్ చేయండి. లాంచ్ సమయంలో కంపెనీ దాని ధర ఏమిటో చూడండి. కొన్నిసార్లు నకిలీ డిస్కౌంట్లు కూడా జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో కొందరు అమాయక కస్టమర్లు మోసపోతారు.
►డిస్కౌంట్లు ఆఫర్లు మాత్రమే కాదు ఆ వస్తువులు మనకి అవసరమా కాదా అని కూడా చూసుకోవాలి. లేదంటే కొన్న తర్వాత వాటిని వాటిని వాడకుండా ఇంట్లో ఓ మూలనా ఉంచాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ వస్తువు నిరుపయోగంగా మారుతుంది.
►మీ కార్ట్‌లో త్వరగా మంచి డీల్‌లను ఉంచుకోండి. లేదంటే ఆఫర్ ముగిసిపోతుందనే తొందరలో మంచి వస్తువులను మిస్ చేసుకునే చాన్స్ ఉంది. కొనుగోలు చేసే ముందు మీరు కొందామని అనుకుంటున్న వస్తువుని ఇతర వాటితో పోల్చి చూడడం ఉత్తమం.
►బ్యాంక్ ఆఫర్‌లను సరి చూసుకోవాలి అలాగే వస్తువులపై కంపెనీ ఇస్తున్న తగ్గింపు ధరలను సరిగా చెక్ చేసుకోవాలి. వీటితో పాటు బయటి మార్కెట్లో, ఇతర వెబ్‌సైట్లో వాటి ప్రస్తుత ధర ఎంత ఉందనేది కూడా తెలసుకోవాలి. మీరు కొనుగోలు చేయదలుచుకున్న ప్రాడెక్ట్ మీ బడ్జెట్‌లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడం ఉత్తమం.
►షిప్పింగ్ చార్జ్‌ల విషయంలోనూ తనిఖీ చేయండి. ఈఎంఐ(EMI) ఆఫర్‌ను సరిగ్గా లెక్కించుకోండి.
Thanks for reading Amazon, Flipkart offers: Keep these in mind before buying
No comments:
Post a Comment