Amazon-Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ షురూ.. మొబైల్స్‌పై డీల్స్ ఇవే..!
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) పండగ సేల్స్ మొదలయ్యాయి. అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. సాధారణ కస్టమర్లకు రేపటి నుంచి (సెప్టెంబర్ 23) సేల్స్ ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా మొబైల్స్ ఈ సేల్స్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఏ ఇ-కామర్స్ సైట్‌లో ఏయే ఫోన్లపై డీల్స్ అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేద్దామా?
అమెజాన్ డీల్స్ వీటిపైనే..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (amazon great indian festival sale 2022) పేరిట సేల్స్ నిర్వహిస్తున్న అమెజాన్‌లో యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ మొబైల్స్‌పై డీల్స్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ వేదికపై కొనుగోలు చేసే వారు ఎస్‌బీఐ కార్డును ఉపయోగించడం ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
ఐఫోన్ 12 (iphone 12): గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా ఐఫోన్ 12ను అమెజాన్ కేవలం రూ.42,999కే విక్రయిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.65,900గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు/డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రూ.39,999కే ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజీ ద్వారా రూ.14,350 వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఎప్పటి నుంచో ఐఫోన్ వాడాలని కోరుకునేవారు ఈ డీల్‌పై ఓ లుక్కేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ (Samsung galaxy S22 5g): శాంసంగ్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవాలనుకునే వారు ఈ డీల్‌ను పరిశీలించొచ్చు. గెలాక్సీ ఎస్22 5జీ ఎమ్మార్పీ రూ.85,999గా ఉండగా.. ఈ సేల్‌లో రూ.52,999కే విక్రయిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలుతో మరింత డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్ఛేంజీ సదుపాయం కూడా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (Oneplus Nord CE2 lite): రూ.20వేల్లోపు ధరలో వన్‌ప్లస్ కొనుగోలు చేయాలనుకునేవారు వన్‌ప్లస్ సీఈ 2 లైట్ ఫోన్‌ను పరిశీలించొచ్చు. ఈ సేల్‌లో దీని ధరను రూ.18,999గా పేర్కొన్నారు. అమెజాన్‌లో అందిస్తున్న రూ.500 కూపన్ ద్వారా దీన్ని రూ.18,499కే దక్కించుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డు, ఎక్స్ఛేంజీ ద్వారా కొనుగోలు చేస్తే మరింత తగ్గుతుంది.
శాంసంగ్ ఎం 13 (Samsung M13): రూ.10 వేల్లోపు మంచి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ చూసేవారు గెలాక్సీ ఎం13ని పరిశీలించొచ్చు. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.14,999 ఉండగా.. సేల్స్‌లో రూ.9,499కే విక్రయిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డుద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు.
ఐకూ నియో 6 5జీ (Iqoo neo 6 5g): ప్రీమియం లుక్‌లో 5జీ ఫోన్ కోసం చూసేవారు ఐకూ నియో 5జీ ఫోన్‌ను పరిశీలించొచ్చు. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.34,999 ఉండగా.. సేల్స్‌లో భాగంగా అమెజాన్‌లో దీన్ని రూ.27,999కే విక్రయిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2వేలు వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు
బిగ్ బిలియన్ డేస్ (flipkart big billion days) పేరిట ఫ్లిప్‌కార్ట్ సేల్ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు 8 రోజుల పాటు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు వినియోగదారులు 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 13, గూగుల్ పిక్సల్ 6ఏ వంటి ఫోన్లపై ఆఫర్లు నడుస్తున్నాయి.
ఐఫోన్ 13 (iphone 13): యాపిల్ ఇటీవల ఐఫోన్ 14 రిలీజ్ చేయడంతో అందరి చూపూ ఇప్పుడు ఐఫోన్ 13పై పడింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 128జీబీ వేరియంట్ రూ.54,990కే అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.69,900గా ఉంది. పాత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా రూ.16,900 వరకు తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్ వినియోగదారులు కార్డు ఆఫర్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
గూగుల్ పిక్సల్ 6ఏ (Google pixel 6A): గూగుల్ పిక్సల్ ఫోన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా గూగుల్ తీసుకొచ్చిన 6ఏ ఫోన్ 128జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.43,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో రూ.34,199కే అందుబాటులో ఉంచింది. ఎక్స్ఛేంజ్, కార్డు ఆఫర్ ద్వారా మరింత తక్కువకే కొనుగోలు చేయొచ్చు.
పోకో ఎక్స్4 ప్రో 5జీ (Poco X4pro 5g): తక్కువ ధరలో 5జీ ఫోన్ కావాలనుకునేవారు ఈ ఫోన్‌పై లుక్ వేయొచ్చు. దీని ఎమ్మార్పీ రూ.23,999గా ఉంది. సేల్‌లో భాగంగా రూ.16,499కే విక్రయిస్తున్నారు.
రియల్‌మీ 9 ప్రో 5జీ (Realme 9 pro 5g): రియల్ బ్రాండ్‌లో ఓ 5జీ ఫోన్ కావాలంటే రియల్‌మీ 9ప్రో 5జీ పరిశీలించొచ్చు. దీని ఎమ్మార్పీ రూ.21,999 ఉండగా.. సేల్‌లో భాగంగా రూ.16,999కే విక్రయిస్తున్నారు. ఎక్స్ఛేంజ్, కార్డు ఆఫర్‌తో మరింత తగ్గే అవకాశం ఉంది.
రూ.10వేల్లోపు బడ్జెట్‌లో పోకో సీ31, సీ 35, రెడ్‌మీ 10, శాంసంగ్ ఎఫ్ 13ను ఫోన్లను డిస్కౌంట్‌పై విక్రయిస్తున్నారు.
ఇవే కాకుండా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్ సైతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో తక్కువకే దొరుకుతున్నాయి.
Thanks for reading Amazon, Flipkart sales.. These are the deals on mobiles..!
No comments:
Post a Comment