Formative Exams | ఓఎమ్మార్ షీట్లతో ఫార్మెటివ్ -1 పరీక్షలు
దసరా సెలవుల తర్వాత నిర్వహణ
పాఠశాల స్థాయిలో నిర్వ హించే ఫార్మెటివ్-1 పరీక్షలను ఈసారి ఓఎమ్మార్ షీట్లతో జరపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1-8 తరగతుల విద్యార్థులకు దసరా సెలవుల తరువాత ఈ విధానంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 20 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో అన్ని సబ్జెక్టులవి కలిపి 15 మార్కుల చొప్పున బిట్లు ఇస్తారు. వీటికి ఓఎమ్మార్ షీట్లో సమాధానాలు గుర్తించాలి. మిగతా 5 మార్కులకు ప్రశ్నపత్రాలను ఇస్తారు. అన్ని సబ్జెక్టు లకు కలిపి ఒకే ఓఎమ్మార్ షీట్ వస్తుంది. ప్రతి రోజు ఆయా సబ్జెక్టు పరీక్షకు ఓఎమ్మార్ షీట్ను విద్యార్థులకు అందించి మళ్లీ వెనక్కు తీసుకుంటారు. మర్నాడు నిర్వహించే మరో పరీక్షకు మళ్లీ అదే ఇస్తారు. ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బిట్లకు ఒక్క ఓఎమ్మార్లోనే సమాధానాలు రాయాలి. 9,10 తరగతుల విద్యార్థులకు మాత్రం సాధారణ ప్రశ్నపత్రాలు ఇస్తారు. మొదట ప్రకటించిన అకడమిక్ కేలండర్ ప్రకారం సెప్టెంబరులో ఫార్మెటివ్-1, అక్టోబర్ ఫార్మెటివ్ -2 పరీక్షలను నిర్వహించాలి.
Thanks for reading Formative Exams:Formative-1 Tests with OMR Sheets
No comments:
Post a Comment