Health Risk: బరువు పెరిగితే గుండె పోటు సమస్యలు వస్తాయా..?
Health Risk Related To Obesity: ప్రస్తుతం చాలామంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు.
అయితే ఇలాంటి సమస్యలు తలెత్తడం వల్ల ఊబకాయం, బరువు పెరగడం, గుండెపోటు వంటి సమస్యలు బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితంగా కొన్ని నియమాలతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఈ సమస్యలు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అంతేకాకుండా ఊబకాయం వల్ల ఇంకొన్ని రకాల ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావచ్చు. ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
ఈ సమస్యలు తప్పవు:
గుండెపోటు సమస్యలు:
ఊబకాయం సమస్యలు తీవ్రతరమైతే గుండెపోటు వంటి సమస్యలు ఉత్పన్నమయ్య అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గుండెకు రక్త సరఫరా చేసే ధమనులలో కొవ్వు నిల్వలు పేరుకుపోయి అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి ముందుగానే ఊబకాయాన్ని గుర్తించి దీని నుంచి ఉపశమనం పొందడం చాలా మందిని నిపుణులు చెబుతున్నారు.
గుండెలో వివిధ సమస్యలు:
ఊబకాయం ఉన్న చాలామందిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికం. కాబట్టి తప్పకుండా ఈ సమస్యపై శ్రద్ధ వహించి దీని నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొందరిలో దీనికి కారణం వల్ల శరీర బలహీనత సమస్యలు కూడా వస్తున్నాయి.
అధిక రక్తపోటు:
అధిక బరువు కూడా అధిక రక్తపోటు సమస్యతో ముడిపడి ఉంటుంది. శరీరంలో ఉండే కొవ్వు కణజాలాలకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అవసరమవుతాయి. దీని కారణంగా మీ రక్తనాళాలు అదనపు కొవ్వు కణజాలాలలో అదనపు రక్త ప్రవాహం కలుగుతుంది. దీని వల్ల కొందరిలో ప్రాణాపాయ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Thanks for reading Health Risk Related To Obesity
No comments:
Post a Comment