Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 17, 2022

Jio has brought super plan .. Amazing benefits , OTT too !


 సూపర్ ప్లాన్ని తీసుకొచ్చిన జియో .. అదిరిపోయే బెనిఫిట్స్ , ఓటీటీ కూడా !

 ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అందుకే టెలికాం రంగంలో టాప్‌ పోజిషన్‌లో కొనసాగుతోంది.

తాజాగా మరో అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది జియో. ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారి డేటా అనేక బెనిఫిట్స్‌తో పాటు ఓటీటీ(OTT) ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రత్యేకంగా ప్రతిరోజూ 3GB డేటా ప్రయోజనాలను అందిస్తోంది.

అదిరిపోయే ప్లాన్‌లు..

- రూ. 419 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడీటీతో 84GB డేటాను అందిస్తుంది. ఇందులో 3GB రోజువారీ డేటా పరిమితి, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ మొబైల్‌కి 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి.

 రూ. 601 ప్లాన్: ఈప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, 3GB రోజువారీ పరిమితితో మొత్తం 90GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ అదనపు 6GB డేటాను కూడా అందిస్తుంది. కస్టమర్లు ఈ ప్లాన్‌తో రూ.499 విలువైన ఒక సంవత్సర డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.

- రూ. 1,199 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడీటీ, 3GB రోజువారీ డేటా పరిమితితో మొత్తం 252GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, జియో యాప్ సబ్‌స్క్రిప్షన్ తోపాటు రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా 3 నెలల (90 రోజులు) అందిస్తుంది.

రూ. 4,199 ప్లాన్: ఈవార్షిక ప్లాన్‌లో 3GB రోజువారీ డేటా పరిమితితో 1095GB డేటాను అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS తో పాటు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. దానితో పాటుగా ఈ ప్లాన్‌ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 1499తో అందిస్తుంది. ఇది OTTలోని అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు ఉచితంగా చూడవచ్చు.

Thanks for reading Jio has brought super plan .. Amazing benefits , OTT too !

No comments:

Post a Comment