టెన్త్ పబ్లిక్ ప్రశ్నపత్రాలకు 'క్యూఆర్' కోడ్
♦️ఎక్కడైనా లీక్ అయితే తెలుసుకునే వెసులుబాటు
♦️బ్లూప్రింట్తో కొత్త మోడల్ పేపర్లు
♦️ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడి
❄️SSC PUBLIC EXAMINATIONS - 2023 SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS
పదో తరగతి పబ్లిక్ పరీక్ష ప్రశ్నపత్రాలను 'క్యూఆర్' కోడ్‌తో సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. తద్వారా పేపర్ లీక్ కాగానే ఏ సెంటర్ నుంచి బయటకు వెళ్లిందో తెలుసుకునే వెసలుబాటు ఉంటుందన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. మోడల్ స్కూల్లో టీచర్ల నియామకం డెమో పరిశీలకుడిగా చిత్తూరుకు వచ్చిన ఆయన బుధవారం పీసీఆర్ ఉన్నత పాఠశాలలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది కేవలం ఆరు పేపర్లతోనే టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి బ్లూప్రింట్‌తో కొత్త మోడల్ పేపర్లు, వెయిటేజ్ టేబుల్స్ సహా ఆన్‌లైన్‌లో ఇప్పటికే పొందుపరిచామని వివరించారు. వెయిటేజ్ టేబుల్ ఆధారంగా విద్యార్థులు మార్కులు సాధించే విధానాలను నేర్పించాలన్నారు. వెయిటేజ్ టేబుల్‌లో అకడమిక్ స్టాండర్డ్‌తో పాటు అన్ని కోణాల్లో సిలబస్ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి సబ్జెక్టులోని యూనిట్‌లోని అంశాలపై విద్యార్థికి పూర్తి అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. వీటితో పాటు అకడమిక్ ప్రారంభం నుంచే డీఈవో, డీవైఈవోలు టెన్త్ విద్యార్థుల సామర్థ్యాలపై హెచ్‌ఎంలతో తరచూ సమీక్షలు నిర్వహించాలని డీఈవో పురుషోత్తంకు సూచించారు. టాప్, యావరేజ్, డల్ స్థాయిల ఆధారంగా విద్యార్థులు అవగాహనతో కూడిన బోధన చేయాలన్నారు. వచ్చే టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొత్త జిల్లాల ఆధారంగానే నిర్వహిస్తామని చెప్పారు. మూల్యాకనం ప్రక్రియ ఎలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తాజాగా జరిగిన టెన్త్ పబ్లిక్ పరీక్షల మార్కుల జాబితాలను నెలాఖరులోగా పంపనున్నట్లు తెలిపారు. కంపార్టుమెంటల్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం రెగ్యులర్‌గానే పరిగణించినా, రెగ్యులర్ వారికి మే నెలగా, కంపార్టుమెంటల్ వారికి జూలై నెలగా మెమోలో పేర్కొంటామన్నారు.
*♦️పారదర్శకంగా డెమో తరగతులు
మోడల్ స్కూల్‌లో కాంట్రాక్టు పద్దతిపై పీజీటీ అభ్యర్థుల తాత్కాలిక నియామక ప్రక్రియలో భాగంగా చేపట్టిన డెమో తరగతులు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు దేవానందరెడ్డి తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన ఉండాలని పీజీటీ మ్యాథమెటిక్స్, బయాలజీ అభ్యర్థులకు ఆయన సూచించారు. డీఈవో పురుషోత్తంతో పాటు మోడల్ స్కూల్ సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమారి, సబ్జెక్టు విషయ నిపుణులు, హెచ్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
❄️SSC PUBLIC EXAMINATIONS - 2023 SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS
Thanks for reading 'QR' Code for Tenth Public Question Papers
No comments:
Post a Comment