Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 21, 2022

Union Cabinet Key Decisions


 Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో వెల్లడించారు.

సౌరశక్తి ప్లాంట్ల కోసం కేంద్రం 19,500 కోట్లు మంజూరు చేసింది.

14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు పీఎల్‌ఐ స్కీమ్ తీసుకొచ్చింది. అలాగే పీఎల్‌ఐ స్కీమ్ కిందకు సోలార్ ప్యానెళ్లను తెచ్చారు. సెమీ కండక్టర్ల అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నెల 17న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కేంద్రం ఆమోదించింది. 2030 నాటికి టాప్ 25 దేశాల్లో చేరేలా లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకునే చర్యలు చేపడ్తారు.

వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రాసెస్ రీ ఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది. దేశం నలుమూలలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా వస్తువులు, ఉత్పత్తుల రవాణా జరగాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించారు. ప్రాసెస్ రీఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది.

లాజిస్టిక్స్ కోసం జీడీపీలో దాదాపు 14 శాతం వరకు ఖర్చవుతుండటంతో దేశీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతోంది. లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఈ ఖర్చు జీడీపీలో ఎనిమిది శాతం లేదా తొమ్మిది శాతం మాత్రమే ఉంటోంది.

లాజిస్టిక్ సెక్టర్‌లో 20కిపైగా ప్రభుత్వ ఏజెన్సీలు, 40 పార్టనర్ గవర్నమెంట్ ఏజెన్సీలు, 37 ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్, 500 సర్టిఫికేషన్లు, 10,000కుపైగా కమోడిటీస్, 160 బిలియన్ డాలర్ల మార్కెట్ సైజ్ ఉన్నాయి. దీనిలో 200 షిప్పింగ్ ఏజెన్సీలు, 36 లాజిస్టిక్స్ సర్వీసెస్, 129 ఇన్లాండ్ కంటెయినర్ డిపోలు, 166 కంటెయినర్ ఫ్రెయిట్ స్టేషన్స్, 50 ఐటీ ఎకోసిస్టమ్స్, బ్యాంకులు, బీమా సంస్థలు ఉన్నాయి. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, లాజిస్టిక్స్ సెక్టర్లో 22 మిలియన్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. పరోక్ష లాజిస్టిక్స్ ఖర్చులు 10 శాతం తగ్గే విధంగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ నూతన విధానం లక్ష్యం. దీనివల్ల ఎగుమతులు ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు వృద్ది చెందుతాయని అంచనా.

Thanks for reading Union Cabinet Key Decisions

No comments:

Post a Comment