Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 8, 2022

Virat Kohli's first century in international T20.


 అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ..

 ఆసియా కప్ ఆఖరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ (122*) అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకం బాదాడు. టీ20ల్లో ఇదే అతడికి అత్యధిక స్కోరు. అంతేకాకుండా ఏ ఫార్మాట్‌లోనైనా దాదాపు రెండేళ్ల 9 నెలల తర్వాత విరాట్ సెంచరీ బాదడం విశేషం. అఫ్గానిస్థాన్‌తో నామమాత్రమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీతో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ (62) అర్ధ శతకంతో రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 6, రిషభ్‌ పంత్ 20* పరుగులు చేశారు.  దీంతో అఫ్గాన్‌కు భారత్‌ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని  నిర్దేశించింది. 

అదిరిపోయే ఆరంభం..

రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఓపెనర్లుగా రాహుల్‌తో విరాట్ కోహ్లీ వచ్చాడు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన వీరిద్దరూ పవర్‌ప్లే ముగిసేసరికి 52 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో 12వ ఓవర్‌కల్లా ఇద్దరూ అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలో 119 పరుగులను జోడించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కేఎల్‌ రాహుల్‌తోపాటు సూర్యకుమార్‌ యాదవ్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు చేరారు. కానీ తర్వాత వచ్చిన రిషభ్‌ పంత్‌తో కలిసి విరాట్ రెచ్చిపోయాడు. మూడో వికెట్‌కు 87 పరుగులను జోడించాడు. అందులో పంత్‌ కేవలం 20 పరుగులే కాగా.. విరాట్‌ 65కిపైగా కొట్టడం గమనార్హం. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరీద్‌ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Thanks for reading Virat Kohli's first century in international T20.

No comments:

Post a Comment