WhatsApp Blocking: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారని డౌట్‌గా ఉందా..? ఈ టిప్స్‌తో తెలుసుకోండి..
కోట్లాదిమంది యాక్టివ్ యూజర్లతో వాట్సాప్ (WhatsApp) ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా నిలుస్తోంది. ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ తన యూజర్లకు ఎన్నో ప్రైవసీ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. వాటిలో బ్లాకింగ్ (Blocking) ఫీచర్ ఒకటని చెప్పవచ్చు.
ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్‌లో ఎవరినైనా సరే క్షణాలలో బ్లాక్ చేయవచ్చు. అయితే అవతలి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. ఆ విషయాన్ని మీరు కొన్ని టిప్స్‌తో తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
* మెసేజ్ ద్వారా.. : మిమ్మల్ని ఎవరైనా ఒక వ్యక్తి వాట్సాప్‌లో బ్లాక్ చేశారని భావిస్తే వారికి ఒక మెసేజ్ పంపించాలి. ఆ మెసేజ్ డెలివరీ స్టేటస్‌లో డబుల్ బ్లూ టిక్‌లకు బదులుగా ఒకే టిక్ కనిపిస్తే, మిమ్మల్ని వారు బ్లాక్ చేసి ఉండవచ్చు. అయితే ఈ మెథడ్ అంత ఎఫెక్టివ్ కాదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఆఫ్‌లైన్‌లో ఉన్నా లేదా వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసినా ఓన్లీ సింగిల్ టిక్ పడుతుంది. ఒకవేళ మెసేజ్‌కి డబుల్ టిక్‌లు కనిపిస్తే.. మిమ్మల్ని అవతలి వ్యక్తి బ్లాక్ చేయలేదని అర్థం చేసుకోవచ్చు.
* గ్రూప్‌లో యాడ్ కాని కాంటాక్ట్ : ఫలానా వ్యక్తి మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేసి ఉంటే వారి కాంటాక్ట్‌ను మీరు కొత్త గ్రూప్ లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్‌లోనూ యాడ్ చేయలేరు. యాడ్ చేయాలని ప్రయత్నిస్తే "కుడ్ నాట్ యాడ్ థిస్ కాంటాక్ట్" వంటి ఒక మెసేజ్‌ను వాట్సాప్ మీకు అందిస్తుంది.
* వీడియో/ఆడియో కాల్ కనెక్ట్ కాదు : అవతలి వ్యక్తికి కాల్ లేదా వీడియో కాల్ కనెక్ట్ చేయలేకపోతున్నారా.. అయితే మిమ్మల్ని ఆ వ్యక్తి బ్లాక్ చేసి ఉండవచ్చు అనటానికి ఇదొక బలమైన సంకేతం. మీరు వాట్సాప్‌లో ఎవరికైనా కాల్ చేసినప్పుడు, వారికి మీ కాల్ ఎప్పటికీ కనెక్ట్ కాకపోతే వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే.
* లాస్ట్‌సీన్ చెక్ : అవతలి వ్యక్తి మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేసినప్పుడు, మీరు వారి లాస్ట్‌సీన్‌ను చూడలేరు. లాస్ట్‌సీన్ మాత్రమే కాదు వారి చాట్ విండో ఓపెన్ చేసినప్పుడు వారి ఆన్‌లైన్ స్టేటస్ కూడా ఏ టైమ్‌లోనూ కనిపించదు. ఆన్‌లైన్ స్టేటస్ వేరే వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు కచ్చితంగా తెలపదు. కానీ మీకు ఒక కాంటాక్ట్ లాస్ట్‌సీన్ అసలు కనిపించకపోతే, అతను/ఆమె మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు.
* ప్రొఫైల్ పిక్, అబౌట్ ఇన్ఫో, స్టేటస్ : మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే వారి వాట్సాప్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ మీకు కనిపించదు. వారి ప్రొఫైల్ పేజీలో అబౌట్ ఇన్ఫో కూడా కనిపించదు. వారి ప్రొఫైల్ పేజీలో వారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడలేరు. అయితే వారు తమ ప్రొఫైల్ పిక్, అబౌట్ ఇన్ఫో ప్రైవసీని నోబడికి చేంజ్ చేసుకుంటే కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ చూడలేరు. అందువల్ల ఇదొక్క మెథడే ఫాలో అయి వారు మిమ్మల్ని బ్లాక్ చేశారు అనే నిర్ణయానికి రాకూడదు. వేరే మెథడ్స్ కూడా చెక్ చేసుకొని నిర్ధారించుకోవాలి.
Thanks for reading whatsApp Blocking: Doubt that someone has blocked you on WhatsApp..? Find out with these tips..
No comments:
Post a Comment