Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 10, 2022

You can easily open an SBI savings account online without going to the branch.


 బ్రాంచ్‌కు వెళ్లే పనిలేకుండా.. ఆన్‌లైన్‌లో సులువుగా SBI సేవింగ్స్‌ అకౌంట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు స్టేట్‌బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా తెరవడం అంటే మామూలు విషయం కాదు. పేజీలకు పేజీలుండే దరఖాస్తు ఫారం నింపి, ఫొటోలు అతికించి, వీలైనన్ని చోట్ల సంతకాలు చేసి తీరా సంబంధిత బ్యాంక్‌ అధికారి దగ్గరికి వెళితే బారెడంత క్యూ మన ముందు కనిపించేది. దరఖాస్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ ధ్రువపత్రమో మిస్‌ అయినా ఇక ఆరోజు అకౌంట్‌ తెరవడం వీలుపడేదే కాదు. కానీ, డిజిటల్‌ పుణ్యామా అని బ్యాంకింగ్‌ సేవలు ఇప్పుడు సులువయ్యాయి. బ్యాంక్‌ ఖాతా తెరవడానికి బ్యాంక్‌ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదంటోంది ఎస్‌బీఐ. సింపుల్‌గా ఆన్‌లైన్‌లోనే వీడియో కేవైసీ ఆధారంగా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాను తెరుచుకోవచ్చని చెబుతోంది. అదెలాగో చూద్దాం..

ఖాతా తెరవడం ఎలా...?

ఆన్‌లైన్‌లో బ్యాంక్‌ ఖాతా తెరవాలంటే ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అందులో ఎస్‌బీఐ సేవింగ్స్‌ ఖాతా తెరవాలనుకుంటున్నారా? అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.

పాన్‌, ఆధార్‌ వివరాలు ఎంటర్‌ చేయాలి.

అప్పుడు ఆధార్‌ అనుసంధానమై ఉన్న మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్‌ చేయాలి.

ఆ తర్వాత సంబంధిత సమాచారాన్ని ఎంటర్‌ చేయాలి.

వీడియో కాల్‌కు షెడ్యూల్‌ చేయాలి. 

షెడ్యూల్‌ సమయంలో మళ్లీ యోనో యాప్‌ తెరిచి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

వీడియో కేవైసీ సమయంలో ఒరిజినల్‌ ఆధార్‌, పాన్‌ కార్డులను చూపించాల్సి ఉంటుంది.

కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక బ్యాంక్‌ అధికారులు వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం మీ పేరున ఖాతా ఓపెన్‌ అవుతంది.

పేపర్‌తో పనిలేదు.. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు..

కొత్తగా సేవింగ్స్‌ ఖాతా తెరవాలనుకునేవారు, ఇంకో ఖాతా ఉండాలని కోరుకునే వారు బ్యాంక్‌ శాఖకు వెళ్లాల్సిన పనిలేకుండా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ఖాతా తెరిచిన వారు యోనో యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంక్‌ ద్వారా నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో ఖాతా తెరిచిన వారికి ఎస్‌బీఐ రూపే కార్డును అందిస్తుంది. ఈ ఖాతాలకు చెక్‌బుక్‌ మాత్రం అందివ్వరు. సంతకంతో కూడిన ఈ తరహా సేవలను పొందాలంటే బ్రాంచ్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే పాస్‌బుక్‌ జారీ చేస్తారు. సాధారణ సేవింగ్స్‌ ఖాతాను తెరిచేందుకయ్యే ఫీజే ఈ ఖాతా తెరిచేందుకు చెల్లించాల్సి ఉంటుంది.

Thanks for reading You can easily open an SBI savings account online without going to the branch.

No comments:

Post a Comment