ASRB: ఐసీఏఆర్ పరిశోధన సంస్థల్లో 349 నాన్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టులు
దేశవ్యాప్తంగా నెలకొన్న ఐసీఏఆర్ పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో ఐదేళ్ల పదవీకాల ప్రాతిపదికన నాన్- రిసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ) ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఐసీఏఆర్ పరిశోధనా సంస్థలు:
ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రిసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ రిసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రిసెర్చ్, సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రిసెర్చ్, సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అలైడ్ ఫైబర్స్ తదితరాలు.
వివరాలు:
1. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
2. డివిజన్ హెడ్, రీజినల్ స్టేషన్/సెంటర్ హెడ్
3. సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్, కేవీకే
మొత్తం ఖాళీల సంఖ్య: 349.
అర్హత: సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ప్రిన్సిపల్ సైంటిస్ట్/ ప్రొఫెసర్‌తో లేదా తత్సమాన హోదాలో పని అనుభవం లేదా పరిశోధన/ బోధన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు 60 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు రూ.144200-రూ.218200, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు రూ.131400-రూ.217100 ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.1500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లించనవసరం లేదు).
ఎంపిక విధానం: విద్యార్హల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.10.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2022.
సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.
Thanks for reading ASRB: 349 Non-Research Management Posts in ICAR Research Institutions
No comments:
Post a Comment