Bank Holidays in November 2022
Bank Holidays November 2022: నవంబర్ నెల ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి. మీరు నవంబర్ నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని చేయాలనుకుంటున్నట్లయితే, ముందుగా ఈ నెలలో బ్యాంకు సెలవల గురించి తప్పకుండా తెలుసుకొని మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం నవంబర్‌లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
RBI సెలవులను మూడు కేటగిరీలుగా విభజించింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్‌లు అకౌంట్లను క్లోజ్ చేయడం వంటివి ఉన్నాయి. జాతీయ సెలవులతో పాటు, కొన్ని రాష్ట్రాల నిర్దిష్ట సెలవులు ఉన్నాయి, వీటిలో ఆదివారాలు అలాగే నెలలోని రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. నవంబర్ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడతాయో తెలుసుకుందాం.
నవంబర్‌లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి
1 నవంబర్ 2022 - కన్నడ రాజ్యోత్సవ/కుట్ - కర్నాటక, మణిపూర్ బ్యాంకులకు సెలవు
6 నవంబర్ 2022 - ఆదివారం
8 నవంబర్ 2022 - గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ
11 నవంబర్ 2022 - కనకదాస జయంతి / వాంగ్లా పండుగ - కర్నాటక, మణిపూర్ బ్యాంకులకు సెలవు
12 నవంబర్ 2022 - శనివారం (2వ శనివారం)
13 నవంబర్ 2022 - ఆదివారం (సెలవు)
20 నవంబర్ 2022 - ఆదివారం (సెలవు)
23 నవంబర్ 2022 - సెంగ్ కుట్సానెమ్-షిల్లాంగ్‌లో బ్యాంక్ సెలవు
26 నవంబర్ 2022 - శనివారం (నాల్గవ శనివారం)
27 నవంబర్ 2022 - ఆదివారం (సెలవు)
ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays in November 2022
No comments:
Post a Comment