Health tips: ఎముకలు ధృడంగా ఉండాలంటే.. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.
శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో, ఎముకలు కూడా అంతే ముఖ్యం. ఎముకలు దృఢంగా ఉంటేనే మనుషులు దృఢంగా కనిపించేది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడతూ ఉంటాయి.
క్యాల్షియం లెవెల్స్ తగ్గడంతో ఎముకలు పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. ఎప్పుడూ దృఢమైన ఎముకలు ఉండాలంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఎముకలు దృఢంగా ఉండడం కోసం ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తినాలి? వంటి అనేక అంశాలను తెలుసుకుందాం.
ఎముకలు దృఢంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహరం ఇదే
పోషకాహారం తీసుకోవడం, జీవనశైలి అలవాట్లు మీకు బలమైన ఎముకలను నిర్మించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇక ఆరోగ్యకరమైన ఎముకలు ఉండాలంటే ఎముకల దృఢత్వాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనం కూరగాయలను ఎక్కువగా తినాలి . ఆకుకూరలు, కూరగాయలు తినడం మాత్రమే కాకుండా పాలలో క్యాల్షియం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాలను తాగితే ఎముకల దృఢత్వం పెరుగుతుంది. పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు ఎందుకంటే పాలల్లో దాదాపు అన్ని రకాల పోషకాలు ఇది మన శరీరానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుందని చెబుతారు. ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగితే పుష్కలంగా కాల్షియం వస్తుందని, ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు.
నువ్వులతో ఎముకలలో దృఢత్వం
ఇక ఇదే సమయంలో మన ఆహారంలో నువ్వులను ఒక భాగం చేసుకుంటే కచ్చితంగా ఎముకలు దృఢంగా ఉంటాయి. నువ్వులలో పాల కంటే అదనంగా 13 శాతం ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నువ్వులలో 1450 గ్రాముల కాల్షియం ఉంటుంది. నువ్వులలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెద్దలకు 450 మిల్లీగ్రాములు, పిల్లలకు 600 మిల్లీగ్రాములు, గర్భిణీ స్త్రీలకు తొమ్మిది వందల మిల్లీగ్రాముల క్యాల్షియం ప్రతి రోజూ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ గుప్పెడు నువ్వులను తింటే మన శరీరానికి కావల్సిన కాల్షియం ఇట్టే లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఉడకబెట్టిన గుడ్లతో ఎముకలలో పటుత్వం
ఇక మాంసాహారం తినే వారిలో ఎక్కువ ప్రోటీన్ తీసుకునేలా చూసుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తప్పనిసరిగా తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎముకల బలానికి గుడ్లు కూడా దోహదం చేస్తాయని చెబుతున్నారు.ఎముకలు దృఢంగా ఉండాలంటే తగినంత ప్రోటీన్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఎముకలకు తగినంత ప్రోటీన్ తీసుకోవాలి
ఆరోగ్యకరమైన ఎముకలకు తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి, దాదాపు 50% ఎముక ప్రోటీన్‌తో తయారవుతుంది. తక్కువ ప్రోటీన్ తీసుకోవడం కాల్షియం శోషణను తగ్గిస్తుందని పరిశోధకులు నివేదించారు మరియు ఎముకల నిర్మాణం మరియు విచ్ఛిన్నం రేటును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఎముకలు బలంగా ఉండటానికి జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చని, డ్రై ఫ్రూట్స్ తో మెరుగైన ఫలితాలు ఉంటాయని, ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Thanks for reading Health tips: To keep bones strong.. take these precautions in food.
No comments:
Post a Comment