Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 31, 2022

New Rules Form November 1


New Rules Form November 1: రేపటి నుంచి కొత్త రూల్స్‌.. మారనున్న ట్రైన్స్ టైమింగ్.. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా..

Important Changes Form November 1: రేపటి నుంచి నవంబర్ నెల ప్రారంభం కానుండగా.. పలు రంగాల్లో కొన్ని నింబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

కొత్తగా అమల్లోకి వచ్చే నిబంధనలతో ప్రజలపై మరింత భారం పడే అవకాశం కనిపిస్తోంది. కొత్త రూల్స్‌పై ఓ లుక్కేయండి

విద్యుత్ సబ్సిడీకి కొత్త నిబంధన

నవంబర్ 1 నుంచి ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఈ నిబంధన ప్రకారం విద్యుత్తుపై సబ్సిడీ నమోదు చేసుకోని వారికి రేపటి నుంచి ఈ సబ్సిడీని నిలిపివేస్తారు. ఒక నెలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు ఢిల్లీ వాసులు నమోదు చేసుకోవడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయలేని వారు అనర్హులు. అక్టోబరు 31వ తేదీలోగా నమోదు చేసుకున్న వారికే సబ్సిడీ ఇవ్వనున్నారు.

బీమాదారులకు KYC తప్పనిసరి..?

బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నవంబర్ 1 నుంచి బీమా సంస్థలు KYC (నో యువర్ కస్టమర్) వివరాలను అందించడాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు KYC వివరాలను తప్పనిసరిగా అందించాల్సి అవసరం లేదు. నవంబర్ 1 నుంచి తప్పనిసరి చేయనున్నారు. కొత్త, పాత కస్టమర్‌లకు KYC సంబంధిత నియమాలను తప్పనిసరి చేయవచ్చు. మీరు బీమా క్లెయిమ్ చేస్తున్నప్పుడు KYC పత్రాలను సమర్పించకుంటే మీ క్లెయిమ్ తిరస్కరించవచ్చు.

గ్యాస్ సిలిండర్ ధర

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా 1వ తేదీన సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరలు మరోసారి పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇటీవల అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అందువల్ల నవంబర్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్టోబర్ 1, 2022 నుంచి ఢిల్లీలో ఇండియన్ 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.25.5 తగ్గింది.

రైలు షెడ్యూల్‌లో మార్పు సాధ్యమే

నవంబర్ 1 నుంచి భారతీయ రైల్వే కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం అనేక వేల రైళ్ల టైమ్ టేబుల్ మారనుంది. మీరు నవంబర్ 1వ తేదీ లేదా తర్వాత ప్రయాణిస్తున్నట్లయితే.. రైలు సమయాలు కచ్చితంగా తెలుసుకోండి. ఇంతకుముందు ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలు చేయవలసి ఉండగా.. ఇప్పుడు నవంబర్ 1 నుంచి వర్తించనున్నాయి.

Thanks for reading New Rules Form November 1

No comments:

Post a Comment