Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 29, 2022

Precautions to be taken to avoid paralysis.


 పక్షవాతానికి దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పక్షవాతం పెద్ద సమస్య. చెట్టంత మనిషిని ఉన్నట్టుండి కుప్పకూల్చేస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే వైకల్యమూ సంభవిస్తుంది. కాబట్టే దీని నివారణకు అంత ప్రాధాన్యం. ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటే పక్షవాతం దరిజేరకుండా చూసుకోవచ్చు.

మన అవయవాలన్నింటినీ పని చేయించేది మెదడే. నిరంతరం తగినంత రక్త సరఫరా జరిగితేనే ఇది సక్రమంగా పనిచేస్తుంది. ఒకవేళ మెదడులోని ఏ భాగానికైనా రక్తం అందకపోతే అది పనిచేయటం ఆగిపోతుంది. ఇదే పక్షవాతం.  రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు మెదడు కణాలు మరణించటం మొదలెడతాయి. కండరాలు, మాట, జ్ఞాపకాల వంటి వాటిని నియంత్రించే భాగాలు దెబ్బతింటాయి. ఫలితంగా శరీర భాగాలు చచ్చుబడటం, మాట పడిపోవటం వంటివి తలెత్తుతాయి. వయసు మీద పడుతున్న కొద్దీ పక్షవాతం ముప్పూ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఇంట్లో తల్లి, తండ్రి లేదూ సన్నిహిత కుటుంబ సభ్యులెవరికైనా పక్షవాతం వచ్చి ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. మనం వయసును వెనక్కి మళ్లించలేకపోవచ్చు. కుటుంబ చరిత్రనూ మార్చలేకపోవచ్చు. కానీ పక్షవాతానికి దారితీసే చాలా కారణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటి గురించి తెలుసుకొని, అప్రమత్తంగా ఉంటే ప్రమాదాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

రక్తపోటు అదుపు

పక్షవాతానికి అతిపెద్ద ముప్పు కారకం ఇదే. రక్తపోటు నియంత్రణలో లేకపోతే పక్షవాతం ముప్పు రెట్టింపు అవుతుంది. కొందరిలో నాలుగింతలూ పెరగొచ్చు. అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవటం, ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకోవటం ద్వారా పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చు. సాధారణంగా రక్తపోటు 120/80 లోపు ఉండటం మంచిది. అంతకన్నా మించితే తాత్సారం చేయరాదు. డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి. ‘అధిక రక్తపోటు మా ఇంటా వంటా లేదు’ అని భీష్మించుకోవద్దు. లక్షణాలేవీ లేవని కొట్టిపారేయొద్దు. ఆహారంలో మార్పులు, ఇంకాస్త ఎక్కువగా వ్యాయామం చేయటం ద్వారానే చాలావరకు రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. వీటితో సాధ్యం కాకపోతే మందులు వేసుకోవాల్సిందే.

బరువు తగ్గించుకోవాలి

ఊబకాయం మాత్రమే కాదు.. దీంతో ముడిపడిన అధిక రక్తపోటు, మధుమేహం వంటివీ పక్షవాతం ముప్పును పెంచుతాయి. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నట్టయితే తగ్గించుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా కూడా తీసుకోవాలి. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25, అంతకన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కేవలం 5 కిలోల బరువు తగ్గినా పక్షవాతం ముప్పు తగ్గటంలో పెద్ద ప్రభావమే చూపుతుంది.

ఎలా తగ్గించుకోవాలి?

* ఆహారం ద్వారా లభించే కేలరీలను రోజుకు 1,500 నుంచి 2,000 లోపే పరిమితం చేసుకోవాలి. చేసే పనులు, శారీరక శ్రమ తీరుతెన్నులు.. బీఎంఐని బట్టి కేలరీల మోతాదును నిర్ణయించుకోవాలి.

* వ్యాయామం, ఆటల వంటి వాటిని విధిగా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి.

ఎలా తగ్గించుకోవాలి?

* ఉప్పు వాడకం తగ్గించాలి. రోజుకు 1,500 మి.గ్రా. (అర చెంచా) కన్నా మించనీయొద్దు.

* వేపుళ్ల వంటి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.

* రోజూ 4-5 కప్పుల పండ్లు, కూరగాయలు.. వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినాలి. వెన్న తీసిన పాలు, పాల పదార్థాలు.. పొట్టు తీయని ధాన్యాలు కాస్త ఎక్కువగా తీసుకోవాలి.

* రోజూ కనీసం 30 నిమిషాల సేపైనా వ్యాయామం చేయాలి. నడిచినా చాలు.

* సిగరెట్లు, చుట్టలు, బీడీల జోలికి వెళ్లొద్దు.

మరింతగా వ్యాయామం

బరువు, రక్తపోటు తగ్గటానికి వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇలా పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగానూ పక్షవాతం ముప్పు తగ్గేలా చేస్తుంది. వ్యాయామంతో గుండె వేగం పెరుగుతుంది మరి. అన్ని భాగాలకు రక్త సరఫరా మెరుగవుతుంది. ఫలితంగా రక్తనాళాల ఆరోగ్యమూ పుంజుకుంటుంది. దీంతో పక్షవాతం వచ్చే అవకాశమూ తగ్గుతుంది.

ఎలా సాధించాలి?

*వ్యాయామం చేయటం అలవాటుగా మలచుకోవాలి. కావాలంటే స్నేహితులతో కలిసి నడవొచ్చు. దీంతో ఒకరిని చూసి మరొకరు మరింత ఉత్సాహంగా వ్యాయామం చేయటానికి వీలుంటుంది. ఒకేసారి అరగంట సేపు వ్యాయామం చేయటానికి సమయం లేకపోతే 10 లేదా 15 నిమిషాల చొప్పున విభజించుకోవచ్చు.

మధుమేహం నియంత్రణ

నిరంతరం రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటూ వస్తుంటే రక్తనాళాలు దెబ్బతింటాయి. లోపల రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. మెదడుకు రక్త సరఫరా చేసే నాళాల్లో గడ్డలు ఏర్పడితే పక్షవాతం సంభవిస్తుంది. అందువల్ల మధుమేహం గలవారు దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.

ఎలా సాధించాలి?

* డాక్టర్‌ సూచించినట్టుగా నడచుకోవటం ప్రధానం. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ గ్లూకోజు మోతాదులను అదుపులో ఉంచుకోవాలి.

పొగ మానెయ్యాలి

సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి తాగితే రక్తం గడ్డలు త్వరగా ఏర్పడే ప్రమాదముంది. పొగతో రక్తం చిక్కబడుతుంది, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం ఎంతైనా అవసరం. పక్షవాతం ముప్పు తగ్గటంలో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

ఎలా సాధించాలి?

* గట్టిగా ప్రయత్నిస్తే   ఎవరికి వారే పొగ అలవాటును దూరం చేసుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవటానికి వెనకాడొద్దు. నికొటిన్‌ మాత్రలు, పట్టీలు, కౌన్సెలింగ్‌ వంటివి పొగ మానెయ్యటానికి తోడ్పడతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Thanks for reading Precautions to be taken to avoid paralysis.

No comments:

Post a Comment