SBI Home Loans: హోంలోన్స్‌పై డిస్కౌంట్ ఇచ్చిన ఎస్‌బీఐ
పండుగ సీజన్ నేపథ్యంలో 2023 జనవరి 31 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ గృహ రుణాల వడ్డీ రేటుపై 0.15-0.25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణ రేట్లు 8.55-9.05 శాతంగా ఉండగా, పండుగ ఆఫర్‌లో భాగంగా అవి 8.40 నుంచి 9.05 శాతం మధ్యలో లభించనున్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటులో రాయితీ, ఈఎంఐలు (నెలవారీ కిస్తీలు) ఉంటాయని వివరించింది.
2023 జనవరి 31 వరకు అవకాశ0
దిల్లీ: పండుగ సీజన్ నేపథ్యంలో 2023 జనవరి 31 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ గృహ రుణాల వడ్డీ రేటుపై 0.15-0.25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణ రేట్లు 8.55-9.05 శాతంగా ఉండగా, పండుగ ఆఫర్‌లో భాగంగా అవి 8.40 నుంచి 9.05 శాతం మధ్యలో లభించనున్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటులో రాయితీ, ఈఎంఐలు (నెలవారీ కిస్తీలు) ఉంటాయని వివరించింది. సిబిల్ స్కోర్ 800 అంతకంటే ఎక్కువ పాయింట్లు ఉంటే ప్రస్తుతం 8.55 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఇది 8.4 శాతమే అవుతుంది. 750-799 పాయింట్ల వారికి వడ్డీరేటు 8.65 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గుతుంది. 700-749 పాయింట్ల వారికి రుణరేటు 8.75 శాతం నుంచి 8.55 శాతానికి కుదించనుంది.
తనఖా రుణాలపై 0.30 శాతం రాయితీ: స్థిరాస్తి తనఖాపై రుణాలు (ఎల్‌ఏపీ) తీసుకునే వారికి వడ్డీ రేటులో గరిష్ఠంగా 0.3 శాతం రాయితీ అందుతుందని బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుతం ఈ రుణాలపై 10.3 శాతం వడ్డీ రేటు ఉండగా, 10 శాతానికి లభిస్తాయి. ఇందుకు రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరు 800 అంతకంటే ఎక్కువగా ఉండాలి.
* రెగ్యులర్, టాప్‌అప్ గృహ రుణాలపై ప్రాసెసింగ్ రుసుములు వసూలు చేయట్లేదని, ఎల్‌ఏపీపై మాత్రం రూ.10,000+జీఎస్‌టీని ప్రాసెసింగ్ రుసుముగా వసూలు చేస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
Thanks for reading SBI Home Loans: SBI has given discounts on home loans
No comments:
Post a Comment